Top
logo

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు మంచి చెడూ..

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 1st April
X

Daily Horoscope:(ఫైల్ ఇమేజ్) 

Highlights

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశిలో వ్యాపారం చేసేవారికి ప్రయోజనం ఉంటుంది.

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| గురువారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషం: మేష రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు కావలసిన దానిపై దృష్టి సారించండి. మీరు వ్యాపారంలో ఉంటే, ముందుకు సాగడానికి మరియు రిస్క్ తీసుకోవటానికి ఈరోజు మంచి రోజు. ఎందుకంటే అవి మీకు అనుకూలంగా పనిచేస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. కొన్ని శుభకార్యాలకు ఆహ్వానం అందుకుంటారు.

వృషభం: ఈ రోజు మీరు మీ సహజమైన మనస్సు ద్వారా నియంత్రణ సాధిస్తారు. ఇతరులకు బాధ కలిగించే విధంగా మీ భావాలు ఉండరాదని గ్రహిస్తారు. ధ్యానం చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిథునం: మీరు ఎవరితోనైనా సమావేశాన్ని ప్లాన్ చేస్తే, గందరగోళం కారణంగా ఆ పని వాయిదా పడవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆలస్యం చేయకూడదు. మీరు చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి.

కర్కాటక రాశి: ఈ రోజు మీకు అదృష్టం కలిసి రానుంది. మీ చేపట్టిన ప్రతి పనిలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు నిరాశాజనకంగా ఉండనుంది. వారి శ్రమకు తగ్గ గుర్తింపు లభించదు.

సింహ రాశి: కొత్త స్నేహాలు మీ దారిలోకి రానున్నాయి. కొందరు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడనుంది. వారు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. మీరు వారితో బంధం కోసం ఒక యాత్రను కూడా ప్లాన్ చేయవచ్చు. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. కొన్ని శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది.

కన్య: ఈ రోజు సమాజంలో మీ కీర్తి, ప్రతిష్ట పెరుగుతాయి. ఏ పనిచేయకపోయినా వ్యక్తిత్వం వృద్ధి చెందుతుంది. ఉత్తమ మార్గాల నుంచి డబ్బు సంపాదించుకుంటారు. వ్యాపారంలో మీ తెలివితేటలతో లాభాలు అందుకుంటారు. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. భవిష్యత్తు వ్యూహాలపై పనిచేసే అవకాశముంటుంది.

తులా రాశి: మీ ఆర్థిక పరిస్థితి ఈ రోజు ఆశాజనకంగా ఉండనుంది. డబ్బుకు సంబంధించి మీకు శుభవార్త కూడా అందుతుంది. అయితే అవసరమైన చోటే డబ్బును ఖర్చు చేయాలి, లేకపోతే భవిష్యత్తులో సమస్య తప్పదు. ఆదా చేయడం మీకు మేలు చేయనుంది.

వృశ్చిక రాశి: ఈ రోజు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో, దానిపై ముందడుగు వేస్తారు. కొందరు మీతో మాట్లాడటానికి ప్రయత్నించవచ్చు. అయితే మీ అభిప్రాయాల్ని వారికి స్పష్టంగా చెబుతారు. ఇతరులు చెప్పే వాటిని విస్మరించడానికి ప్రయత్నించండి. ఇది మిమ్మల్ని సంతోషకరమైన స్థితిలో ఉంచుతుంది. ఆకస్మిక ప్రయాణాల కారణంగా రుణాలు చేయాల్సి వస్తుంది.

ధనుస్సు: ధనుస్సు రాశి వారు ఈ రోజు చాలా మార్పులను గమనిస్తారు. అయితే చింతించవలసిన అవసరం లేదని గ్రహించండి. మీ కార్యాలయంలో అభివృద్ధిని మీరు గమనించవచ్చు. మీరు కొంతమంది వ్యక్తులతో కష్టపడి పనిచేసినట్లయితే అందుకు తగిన ప్రతిఫలం లభించడానికి బీజం పడనుంది.

మకర రాశి: మీరు చాలా అధికంగా శ్రమించి పని చేసేవారు మరియు ఈ రోజు మీపై అధికారులు, చుట్టుపక్కలవారు ఇది గమనిస్తారు. కొందరు మీతో కాలక్షేపం చేయడానికి వెనకడుగు వేస్తారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రేమించాల్సిన అవసరం లేదని గ్రహించి ముందుకు సాగుతారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది.

కుంభరాశి: వ్యాపారం చేసేవారికి ప్రయోజనం ఉంటుంది. ఆదాయాన్ని పెంచేందుకు అవకాశాలు ఏర్పడతాయి. పనిభారం పెరుగుతూనే ఉంటుంది. మీ లక్ష్యాలను విజయవంతంగా సాధించడంలో మనస్సు లగ్నం చేస్తారు. ఈ రోజు మీరు చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. ప

మీనరాశి: నేడు మీకోసం మీరు నిలబడేందుకు ప్రయత్నించండి. మీ పనికి మీరు పూర్తి క్రెడిట్ తీసుకోండి. కొన్నిసార్లు మీ కంఫర్ట్ జోన్ నుండి వైదొలగడానికి మరియు కొత్త పనులను చేయడానికి మీ శ్రమ, నైపుణ్యం దోహదం చేయనున్నాయి. కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పనులలో అవాంతరాలు తొలగిపోతాయి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 1st April
Next Story