Top
logo

Daily Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 14 October 2021
X

Representation Photo

Highlights

Daily Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు

ఈరోజు రాశి ఫలాలు: శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం; శుక్లపక్షం నవమి: రా.9.53 తదుపరి దశమి ఉత్తరాషాఢ: మ.1.35 తదుపరి శ్రవణం వర్జ్యం: సా. 5.25 నుంచి 6.57 వరకు అమృత ఘడియలు: ఉ.7.30 నుంచి 9.01 వరకు తిరిగి రా. 2.37 నుంచి 4.09 వరకు దుర్ముహూర్తం: ఉ. 9.50 నుంచి10.36 వరకు తిరిగి మ.2.30 నుంచి 3.17 వరకు రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు సూర్యోదయం: ఉ.5-56, సూర్యాస్తమయం: సా.5-38 మహర్నవమి

మేష రాశి: చాలా రోజులుగా నిలిచిపోయిన పని పూర్తి కావచ్చు. వివాహితులైన వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ మనస్సులోని విషయాలు అందరికీ చెప్పవద్దు, నష్టం జరగవచ్చు. ఇంటికి సంబంధించిన సమస్యకు పరిష్కారం ఉంటుంది. కార్మికవర్గానికి సమయం మిశ్రమంగా ఉంటుంది.

వృషభ రాశి: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థికంగా మునుపటి కంటే బాగుంటారు. అది మీలో విశ్వాసాన్ని, సరళతను పెంచుతుంది. కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని వదులుకోడానికి సిద్దంగా ఉండాలి. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి.

మిథున రాశి: ఈ రాశికి చెందినవారు కార్యాలయాల్లో ఇతరుల విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనిచో మీ యొక్క ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. మీ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఉండటానికి కేటాయించండి.

కర్కాటక రాశి: శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని, పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చెయ్యండి.

సింహ రాశి: అధికారులతో విభేదాలు కార్యాలయంలో సాధ్యమే. సౌకర్యవంతమైన విషయాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. పరస్పర సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. న్యాయం వైపు బలంగా నిలబడతారు.

కన్యా రాశి: ఈ రాశి వారు ఈ రోజు తలచిన పనులు నెరవేరుతాయి. వ్యాపారుల మీద బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులకు ఆర్థిక సాయం అందిస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

తులా రాశి: ఈ రోజు ఈ రాశి వారికి చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నా సంతానం నుంచి శుభవార్తలు వింటారు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి, ఆదాయం బాగా పెరుగుతుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో పురోభివృద్ది కనపడుతోంది. అధికారులనుండి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తికి సంబంధించి మీ కలలు ఫలించే సూచనలు కనపడుతున్నాయి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆరోగ్యం పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. చిన్నప్పటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యంలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగానికి సంబంధించి ఒక కంపెనీ నుంచి అనుకూల సమాచారం అందుతుంది.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారంలో అధిక పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు అధికంగా వున్నప్పటికీ తగిన ధనం చేకూరుతుంది. జీవిత భాగస్వామితో వివాదాలకు దిగవద్దు. ఉద్యోగస్తులు బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులకు అన్నివిధాలా బాగుంది. ఐటీ రంగాల వారికి చాలా బాగుంటుంది. ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మిత్రుల సహకారంతో ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కగలుగుతారు.

మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారులకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది. గతంలో మీరు ఆదుకున్నవారు ఇప్పుడు మీకు సహాయం చేస్తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన మీద దృష్టి పెడతారు.

గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 14 October 2021
Next Story