Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు తగిన ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది.

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 12th July
x

Daily Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: మీమీ రాశి దినఫలాలు ఎలా వున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| సోమవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారం అంత సజావుగా జరగదు. ఉద్యోగులు ఇతరులతో జాగ్రత్తగా మసులుకోవాలి. మీ జీవిత భాగస్వామికి ఆనారోగ్య సూచనలు ఘోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా పర్వాలేదు.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారస్థులకు ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అధిక శ్రమతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో కూడా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవ్వరికీఎటువంటి హామీలు ఇవ్వవద్దు. ఒత్తిడి అధికంగా వున్నప్పటికీ అధికారుల సహాయంలో పనులు పూర్తి చేస్తారు.

కర్కాటకరాశి: ఈరాశి వారికి ఈ రోజు తగిన ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది. ఉద్యోగ అవకాశాలు కలసి వస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారాలు అనుకూలంగా వుంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. జీవితంలో స్థిరత్వం ఏర్పడడానికి నాంది పలుకుతారు. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఎటు చూసినా శుభమే గోచరిస్తోంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది.

తులరాశి: ఈరాశి వారికి ఈరోజు వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి కాకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉత్సాహంతో పని చేస్తారు. అవసరాలకు ధనం లభిస్తుంది. ఆదాయపరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. : ముఖ్యమైన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. ఎవ్వరికీ హామీలు ఇవ్వొద్దు. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్త.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు.

మకర రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. అనవసర విషయాల్లో తలదూర్చకపోతే మంచిది.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ఆస్తి కొనుగోలు లేదా విక్రయం చేయడానికి చట్టపరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రమాదవశాత్తు వాహనాలకు నష్టం వాటిల్లవచ్చు. అంతేకాకుండా మీ ఖర్చులు కూడా పెరుగుతాయి.

మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా వుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories