Daily Horoscope: నేటి రాశి ఫలాలు.. వృత్తి, వ్యాపారాల వారికి అనుకూల సమయం

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu 24 02 2022
x

Daily Horoscope: నేటి రాశి ఫలాలు.. వృత్తి, వ్యాపారాల వారికి అనుకూల సమయం

Highlights

Daily Horoscope: నేటి రాశి ఫలాలు.. వృత్తి, వ్యాపారాల వారికి అనుకూల సమయం

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు; మాఘ మాసం; బహుళ పక్షం అష్టమి: మ.1.51 తదుపరి నవమి అనూరాధ: మ.12.36 తదుపరి జ్యేష్ఠ వర్జ్యం: సా.5.49 నుంచి 7.19 వరకు అమృత ఘడియలు: రా.2.47 నుంచి 4.18 వరకు దుర్ముహూర్తం: ఉ.10.17 నుంచి 11.04 వరకు తిరిగి మ.2.55 నుంచి 3.12 వరకు రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు సూర్యోదయం: ఉ.6.26, సూర్యాస్తమయం: సా.6.01

మేష రాశి: ఈ రోజు ఈ రాశి వారు అకస్మాత్తుగా డబ్బు సంపాదించడం ద్వారా ఈ రోజు పనిని పూర్తి చేస్తారు. వ్యాపార పనుల్లో నిమగ్నమై ఉంటారు. కార్యాలయంలో మందగమనం కారణంగా ఈ రోజు మీ దృష్టి మరల్చవచ్చు. గతంలో తీసుకున్న నిర్ణయాలు కొంత ద్రవ్య లాభాలకు దారితీస్తాయి.

వృషభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం. తల పెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది.

మిథున రాశి: ఈ రాశివారికి ఈ రోజు కొన్ని కారణాల వల్ల మనస్సులో సందిగ్ధత నిండి ఉంటుంది. వ్యాపారం నెమ్మదిస్తుంది. పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు అందుకుంటారు. వ్యసనాలతో డబ్బును వృథా చేయకుండా ఉండండి. కార్యాలయంలో మార్పు సంకేతాలు ఉన్నాయి. ఆలోచించి ఏదైనా పనిని ముందుకు తీసుకెళ్లండి.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రోజు పనుల పట్ల మరింత నిర్లక్ష్యం తగదు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. పరిస్థితుల మార్పు కారణంగా, ముఖ్యమైన పనిని ముందుగానే పూర్తి చేయండి. అనంతరం జరుగుతున్న సమయంలో అంతరాయం ఉండవచ్చు.

సింహ రాశి: ఈ రాశివారికి ఆర్థిక, రియల్ ఎస్టేటు రంగంలో శుభకరంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేసే అవకాశముంది. పూర్వీకులు లేదా ఇతర ఆస్తి నుంచి లాభాలు పొందే అవకాశముంది. భార్యభర్తల మధ్య సంబంధం వెడెక్కుతుంది. మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

కన్యా రాశి: ఈ రాశి ఈ రోజు ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో మిమ్మల్ని ప్రభావవంతంగా ఉంచడానికి, కొన్ని ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. అవసరమైన వస్తువులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.

తులా రాశి: ఈ రోజు ఈ రాశి వారికి చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నా సంతానం నుంచి శుభవార్తలు వింటారు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి, ఆదాయం బాగా పెరుగుతుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడి శ్రమకు గురవుతారు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. ఆరోగ్యం ఫరవాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

ధనుస్సు రాశి: ఈ రాశి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాంశాలు బాగా మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మిత్రులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు పెళ్లి సంబంధం కుదురుతుంది.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం అనుకూలంగా ఉండదు. మీ మాటలపై నియంత్రణ ఉంచండి. మీకిష్టమైనవారి మధ్య దూరం పెరుగుతుంది. మీరు ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరికీ రుణాలు ఇవ్వకండి, తీసుకోకండి. స్నేహితులు, పరిచయస్తులతో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆరోగ్యం పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. చిన్నప్పటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యంలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగానికి సంబంధించి ఒక కంపెనీ నుంచి అనుకూల సమాచారం అందుతుంది.

మీన రాశి: ఈ రాశి ఈ రోజు ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories