గోమాత.. సకల దేవతల నిలయం

గోమాత.. సకల దేవతల నిలయం
x
Highlights

గోమాతలో సమస్త దేవతలు ఉన్నారు. పాదముల్లో పితృదేవతలు, కాళ్ళల్లో - సమస్త పర్వతాలు, భ్రూమధ్యమున గంధర్వులు, దంతముల్లో గణపతి ముక్కున శివుడు ముఖమున...

గోమాతలో సమస్త దేవతలు ఉన్నారు. పాదముల్లో పితృదేవతలు, కాళ్ళల్లో - సమస్త పర్వతాలు, భ్రూమధ్యమున గంధర్వులు, దంతముల్లో గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్య, చంద్రాదులు, చెవుల్లో శంఖు చక్రాలు, కంఠంలో విష్ణుమూర్తి, భుజమున సరస్వతి, రొమ్మున నవ గ్రహములు,

వెన్నునందు వరుణదేవుడు, అగ్నిదేవుడు, తోకలో చంద్రుడు, చర్మమున ప్రజాపతి, రోమంలో త్రింశత్కోటి దేవతలు ఉంటారు.

అందుకే గోమాతను పూజించి పాపములను పోగొట్టుకొని ఆయురారోగ్యములను, అష్టశ్వైర్యములను పొందవచ్చును. గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారం పెట్టినంత పుణ్యఫలం కలుగుతుంది. మనసారా నమస్కరిస్తే సమస్త దేవతలకు నమస్కరించినంత పుణ్యం కలుగుతుంది. గోమాతకు ప్రదక్షిణం చేస్తే భూమండలమంతా ప్రదక్షిణం చేసినంత ఫలము కలుగుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories