దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు?

దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
x
Highlights

కొబ్బరికాయను కొట్టడం శాంతి కారకం. అరిష్టనాశకం. శాస్త్రం చెప్పిన ప్రకారం కొబ్బరికాయను కొట్టడంలో కొన్ని నియమాలున్నాయి. వాటిని సంగ్రహంగా చూద్దాం....

కొబ్బరికాయను కొట్టడం శాంతి కారకం. అరిష్టనాశకం. శాస్త్రం చెప్పిన ప్రకారం కొబ్బరికాయను కొట్టడంలో కొన్ని నియమాలున్నాయి. వాటిని సంగ్రహంగా చూద్దాం. భగవన్నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి, ఆ తరువాత కొబ్బరి కాయను జుట్టున్న ప్రదేశాన చేతబట్టుకొని, భగవమ్తుని స్మరిస్తూ కొట్టాలి. రాతిపై కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ కోణంగా ఉండడం మంచిది. కాయను కొట్టేటప్పుడు తొమ్మిదంగుళాల ఎత్తు నుంచి కొట్టడం మంచిది. సరిగ్గా రెండు భాగాలుగా పగలడం మంచిదే. అలాకాక వేరుగా పగిలినా, కుళ్ళు కనిపించినా దిగులుపడక్కర్లేదు. అదేదో హాని కలిగిస్తుందని చింతించనవసరం లేదు. 'శివాయనమః' అనే మంత్రాన్ని 108సార్లు జపించితే ఆ దోషం పోతుంది. కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు కొబ్బరికాయను కొట్టి దానిని విడదీయకుండా చేతబుచ్చుకొని అభిషేకం చేయరాదు. అలా చేస్తే ఆకాయ మరి నివేదనకు పనికిరాదు. కాయను కొట్టి ఆ జలాన్ని ఒక పాత్రలోకి తీసుకొని, కాయను వేరు చేసి వేరే ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్నీ నివేదన సమయంలో నివేదించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories