Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 23 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి: రా.1-49 తదుపరి అష్టమి | జ్యేష్ఠ నక్షత్రం రా.12-29 తదుపరి మూల | వర్జ్యం: ఉ.7-00 నుంచి 8-31 వరకు | అమృత ఘడియలు: సా.4-07 నుంచి 5-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-29 నుంచి 12-17 వరకు | రాహుకాలం: ఉ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-55
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Sept 2020 9:16 AM IST
Nellore District updates: మర్రిపాడు మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 30 బస్తాల రేషన్..
నెల్లూరు :--
-అక్రమంగా బద్వేలు కు తరలిస్తున్న 30 బస్తాల రేషన్ బియ్యాన్ని అడ్డగించి, పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.
-30 బస్తాల రేషన్ బియ్యాన్ని వాహనాన్ని స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు.
-డ్రైవర్ తో సహా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- 23 Sept 2020 8:42 AM IST
Antarvedi Updates: రానున్న ఐదురోజుల్లో ముహూర్తం చూసి అంతర్వేది నూతన రథం తయారీ పనులకు ముహూర్తం
తూర్పుగోదావరి
రాజమండ్రి: రానున్న ఐదురోజుల్లో ముహూర్తం చూసి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి నూతన రథం తయారీ పనులకు ముహూర్తం
- అంతర్వేది ఆలయ ఏసీ భద్రాజీ
- రావులపాలెం అడితి నుంచి ఆలయ ఆవరణకు చేరుకున్న
- రథం నిర్మాణానికి అవసరమైన బస్తర్ టేకు కలప
- మొత్తం 1,330 ఘనపు అడుగుల బస్తర్ టేకు కలప అవసరమని లెక్కకట్టిన దేవాదాయ శాఖ డీఈ శేఖర్, స్తపతి శ్రీనివాసాచార్యులు
- రావులపాలెంలోని టింబర్ డిపో వద్ద కొనుగోలు చేసి కావాల్సిన సైజుల్లో కోయించి ఆలయానికి తరలింపు
- ఆలయం వద్దకు చేర్చిన కలపకు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసిన ఆలయ అర్చకులు..
- అంతర్వేది ఆలయ ఏసీ భద్రాజీ
- అంతర్వేది ఆలయం వద్ద కొనసాగుతున్న పోలీసు బందోబస్తు ..పోలీసు ఆంక్షలు
- 23 Sept 2020 8:38 AM IST
Anantapur Updates: నిబంధనలు పాటించని పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల చర్యలు..
అనంతపురం:
- గతంలో ఇచ్చిన నోటీసులకు సరైన సంజాయిషీ ఇవ్వకపోవడం... మౌలిక వసతుల కల్పన లేకపోవడంతో పలు పాఠశాలలో మూసివేయాలని ఉన్నతాధికారులకు నివేదిక.
- ధర్మవరంలో నారాయణ, శ్రీ చైతన్య, రవీంద్రభారతి, భాష్యం పాఠశాలను మూసివేయాలని ఆర్జేడీకి నివేదిక
- అనంతపురం రామ్నగర్ లో నారాయణ పాఠశాలకు రూ.లక్ష అపరాధ రుసుం విధింపు
- 23 Sept 2020 8:37 AM IST
Anantapur Updates: ఇంటర్ ప్రథమ సంవత్సరం కి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నేడు ఆన్లైన్లో పరీక్ష :ప్రిన్సిపల్ శివరామకృష్ణయ్య
అనంతపురం:
- ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఆన్లైన్ పరీక్ష కు దరఖాస్తు చేసిన విద్యార్థులకు మాత్రమే అవకాశం
- పరీక్ష లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ నెల 26, 27, 28 తేదీల్లో పుట్టపర్తిలో ముఖాముఖి నిర్వహించి ఎంపిక చేస్తాం:ప్రిన్సిపల్ శివరామకృష్ణయ్య
- 23 Sept 2020 8:34 AM IST
Yedurappa: నేడు కర్ణాటక ముఖ్యమంత్రి యడియురప్ప తిరుమలకు రాక
- రూ. 200 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కర్ణాటక భవన శంకుస్థాపనకు హాజరువకానున్న సీఎం.
- ఏపీ సీఎం జగన్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొననున్న యడియురప్ప
- కర్ణాటక నుంచి వెళ్లే భక్తులకు ఏకకాలంలో వెయ్యి మందికి సదుపాయం కల్పించే విధంగా కర్ణాటక భవన నిర్మాణానికి భూమి పూజ
- ఇవాళ సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 7:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశం కానున్న కర్ణాటక సీఎం.
- గురువారం ఉదయం 6:30 గంటలకు జగన్ తో కలిసి తిరుమల కు పయనం.
- శంకుస్థాపన అనంతరం 10 గంటలకు తిరుగు పయనం







