Bhishma Ekadashi 2026: భీష్మ ఏకాదశి ఎప్పుడు? ఈ రోజే విష్ణు సహస్రనామ జయంతి .!

Bhishma Ekadashi 2026: భీష్మ ఏకాదశి ఎప్పుడు? ఈ రోజే విష్ణు సహస్రనామ జయంతి .!
x

Bhishma Ekadashi 2026: భీష్మ ఏకాదశి ఎప్పుడు? ఈ రోజే విష్ణు సహస్రనామ జయంతి .!

Highlights

Bhishma Ekadashi 2026: భీష్మ ఏకాదశి 2026 జనవరి 29న జరుపుకుంటారు. ఈ రోజే విష్ణు సహస్రనామ జయంతి. తిథి, విశిష్టత వివరాలు తెలుసుకోండి.

Bhishma Ekadashi 2026: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. మాఘ శుక్ల ఏకాదశి తిథినే భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. మహాభారతంలో అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ఈ రోజున శ్రీకృష్ణుడిని స్తుతించి మోక్షాన్ని పొందాడనే పురాణ గాథ ఆధారంగా దీనికి భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చింది.

ఈ ఏకాదశికి మరింత ప్రాధాన్యం కలిగించేది విష్ణు సహస్రనామ జయంతి. భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండగానే పాండవులకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించిన రోజు ఇదేనని పురాణ ప్రతీతి. అందుకే భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ జయంతిని కూడా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

భీష్మ ఏకాదశి 2026 తిథి వివరాలు

2026 సంవత్సరంలో భీష్మ ఏకాదశి తిథి జనవరి 28వ తేదీ సాయంత్రం 4:35 గంటలకు ప్రారంభమై, జనవరి 29వ తేదీ మధ్యాహ్నం 1:55 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథి ప్రకారం జనవరి 29, గురువారం రోజున భీష్మ ఏకాదశిని ఆచరించాల్సి ఉంటుంది.

ఈ రోజున ఉపవాసం ఆచరించి శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల పాపాలు నశించి, మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అలాగే ఈ ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలంలో రావడం వల్ల స్వర్గలోక ప్రాప్తి, సంతాన భాగ్యం, మనశ్శాంతి కలుగుతాయని భక్తులు నమ్ముతారు.

భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పఠించడం, దానం చేయడం, భీష్ముడికి తర్పణం వదలడం వల్ల శుభఫలితాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. విజయాలు, శత్రు విముక్తి కలుగుతాయని విశ్వాసంతో ఈ ఏకాదశిని జయ ఏకాదశిగా కూడా పిలుస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories