ఆలంపూర్ జోగుళాంబ గురించి మీకేం తెలుసు?

ఆలంపూర్ జోగుళాంబ గురించి మీకేం తెలుసు?
x
Highlights

ఆలంపూర్ జోగుళాంబ క్షేత్రానికి దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది.. ఆలంపూర్ క్షేత్రాన్ని క్రీ.శ 600 సంవత్సరాల ప్రాంతంలో చాళుక్యులు నిర్మించారు.. ఈ...

ఆలంపూర్ జోగుళాంబ క్షేత్రానికి దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది.. ఆలంపూర్ క్షేత్రాన్ని క్రీ.శ 600 సంవత్సరాల ప్రాంతంలో చాళుక్యులు నిర్మించారు.. ఈ క్షేత్ర నిర్మాణానికి దాదాపు దాదాపు 100 సంవత్సరాలు పట్టింది. అమ్మవారి 18 శక్తి పీఠాలలో ఆలంపూర్ క్షేత్రం అయిదవ శక్తి పీఠం.. అమ్మవారి పన్ను భాగం ఇక్కడ పడడం వల్ల ఇది ఒక శక్తి పీఠంగా రూపాంతరం చెందింది. ఆలంపూర్ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం కృష్ణా, తుంగభద్ర నదుల సంగమంగా కూడా ఉంది. ఆలంపూర్ క్షేత్రంలో జోగుళాంబ అమ్మవారి గుడితో పాటు తొమ్మిది శైవ క్షేత్రాలు ఉన్నాయి. క్రీ.శ 1390 ప్రాంతంలో మహమ్మదీయుల దాడిలో ఆలయం చాలా వరకు ధ్వంసమయింది.. దాదాపు 615 సంవత్సరాలు అమ్మవారికి ఒక చిన్న గుడిలో పెట్టి పూజలు నిర్వహించారు..

2005 ప్రాంతంలో అమ్మవారికి ప్రత్యేకంగా ఒక గుడి కట్టి అందులో ప్రతిష్టించడం జరిగింది.. అప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చింది.. ఆ శిల్ప సంపద, కట్టడాలు చూసి ఆ కాలంలో నిర్మాణాలు ఎంత పఠిష్టంగా ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు.. 2009లో భారీ వరదల కారణంగా గుడి గోపురం దాక మునిగిపోయి దాదాపు వారం రోజుల పాటు నీటిలోనే మునిగి ఉంది.. సంవత్సరానికొకసారి అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది.. అప్పుడు భక్తులు వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. ఇప్పుడు ఆలంపూర్ మొత్తాన్ని పురావస్తు శాఖ వారు తమ పరిధిలోకి తీసుకొని తవ్వకాలు సాగిస్తున్నారు. ఇంత గొప్ప శిల్ప సంపద , కట్టడ నైపుణ్యాలున్న ఆలంపూర్ క్షేత్రాన్ని ప్రభుత్వం అభివృద్ధి చెయ్యాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆలయం చాలా వరకు శిథిలావస్థకు చేరింది. సౌకర్యాలు కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories