యాత్రల్లో మన సంప్రదాయాలు ఏం చెబుతున్నాయ్‌?

యాత్రల్లో మన సంప్రదాయాలు ఏం చెబుతున్నాయ్‌?
x
Highlights

చాల మందికి కొత్త ప్రాంతాలు సందర్శిoచాలన్న కోరిక ఉంటుంది .కానీ దాన్ని సాకారం చేసుకోవడాoలొనే పలు సమస్యలు ఎదుర్కొంటారు. భగవంతుడు సర్వాoతర్యామి. ఏ...

చాల మందికి కొత్త ప్రాంతాలు సందర్శిoచాలన్న కోరిక ఉంటుంది .కానీ దాన్ని సాకారం చేసుకోవడాoలొనే పలు సమస్యలు ఎదుర్కొంటారు. భగవంతుడు సర్వాoతర్యామి. ఏ యాత్ర చేయకుండ ఉంటే తరువాత కాలం గడిచి, వృద్దప్యoలోకి వచ్చాక, ఆధ్యాత్మిక మార్గంలోకి పట్టిన తరువాత బాధపడే స్థితి వస్తుంది. అందుకే ఆరోగ్యం సహకరించినప్పుడే కొన్ని ముఖ్యమైన తీర్థయాత్రలైనా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. విహార, విజ్ఞాన యాత్రల మాదిరిగా ఆధ్యాత్మిక పర్యటనలను తేలీగ్గా తీసేయలేం. కొన్ని రకాల ఆహ్హ్లదకర ప్రాంతాలను ఎప్పుడు ,ఎలా వెళ్లి చూసి వచ్చిన పెద్ద తేడా ఉండకపోవచ్చు .కానీ తీర్థయాత్రల విషయం అలా కాదు. ఆయా సందర్భాలు, సమయాలలో అలాంటి వాటికీ ప్రతీక విలువ ,గుర్తింపు ఉంటాయీ.ఫలితంగా పుణ్యనికి పుణ్యం, పురుషార్ధం లభిస్తాయని పెద్దలు అంటారు. అందుకే మంచి సమయాన్ని ఎంపిక చేసుకోండి.

ఆధ్యాత్మిక యాత్రలు చేయడానికి ముందు వెంట తీసుకెళ్లవలసిన వస్త్తువులతో పాటు ,పూజా సామాగ్రీని కూడా మరిచిపోకూడదు .ప్రతిది అక్కడికి వెళ్లాకే కొనుక్కోవచ్చు. అనుకొంటే ఒక్కోసారి అనవసర శ్రమ, కాలయాపన, అధిక వ్యయం తప్పకపోవచ్చు. అలాగే యాత్ర నుంచి తిరిగి వస్తూ ఆక్కడి నుంచి ప్రసాదాలతో పాటు కుంకుమ, తీర్థాలు తేచ్చుకోవడం మరిచిపోవద్దు.

ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు కీర్తనలు చేయడం మంచి భక్తుల లక్షణం. తిరుమల యాత్రికులు విధిగా గోవింద నామస్మరణం చేయల్సిందేనంటారు. దైవసంకీర్తనలు, భజనలు మనకే కాక తోటి వారికీ ఎంతో స్పూర్తిని, ఉతేజ్జన్నిస్తాయి. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు, అనుగుణంగా దేవాలయాలలో నడుచుకోవాలి. ఉత్తరాది అర్చకులకు, దక్షిణాది అర్చకులకు మంత్రోచ్చరణలోనూ, వస్త్రధారణలోనూ కొంత తేడా కనపడుతుంది. మనకు మంత్రాలూ వచ్చినా కొత్త ప్రాంతాలలో మనసులోనే చదువుకోవడం మంచిది. ఆధ్యాత్మిక యాత్రలకు అన్నిటి కంటే ముఖ్యం మనసు. ఆత్మశుద్ధితో ,భక్తిప్రవృత్రులతో దైవసందర్సన చేసుకొంటే యాత్రఫలం సిద్దిస్తుంది అని పెద్దలు చేబుతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories