నాలుగేళ్ల బాలుడి కోరిక తీర్చిన జొమాటో..

నాలుగేళ్ల బాలుడి కోరిక తీర్చిన జొమాటో..
x
Highlights

జొమాటో అనగానే గుర్తుకొచ్చేది.. "ఫుడ్" జొమాటో ఆప్ ఒపేన్ చేసి మనకు కావాల్సిన ఫుడ్‌ని అడర్ చేస్తాం కదా!.. అయితే జొమాటో కంపెనీకి ఓ నాలుగేళ్ల బుడ్డోడు తన...

జొమాటో అనగానే గుర్తుకొచ్చేది.. "ఫుడ్" జొమాటో ఆప్ ఒపేన్ చేసి మనకు కావాల్సిన ఫుడ్‌ని అడర్ చేస్తాం కదా!.. అయితే జొమాటో కంపెనీకి ఓ నాలుగేళ్ల బుడ్డోడు తన అమాయకత్వంతో చేసిన పనికి నెటిజన్ల మనసుదోచుకుంటోంది. ఆ బుడ్డోడు చేసిన పని చూసి నెటిన్లు తెగ సంబరపడిపోతున్నారు. ఇంత ఆ నాలుగేళ్ల బాలుడు ఏం చేశాడు అనే కదా మీ డౌట్.. అయితే ఈ కథనం పూర్తిగా చదవండి మీకే అర్ధమౌతోంది. ఫుడ్‌ డెలివరీ చేసే కంపెనీ.. తనకు కావాల్సిన కార్లూ బొమ్మలు కూడా ఇంటికి తెచ్చిస్తాదేమోనని అనుకున్నడో లేక మరింకేవిధంగానో కానీ ఆ బాలుడు తనకు కావాల్సినవన్నీ మెసేజ్‌ చేశాడు. అయితే దీనిపై స్పందించిన జొమాటో మాత్రం వెంటనే ఆ బుడ్డొడి కోరికను తీర్చింది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ముంబయికి చెందిన ఒక చిన్నారి ప్రముఖ ఫుడ్ కంపెనీ జొమాటోకు ఒక మెసేజ్ పంపాడు. ఏం పంపాడు అంటే.. జొమాటో తనకు నచ్చిన ఆట వస్తువులైన బెలూన్లు, కార్లు, గిఫ్ట్స్‌ కావాలని జొమాటోలో పేర్కొన్నాడు. అయితే అది చూసిన ఆ బాలుడి తండ్రి మెసేజ్‌ల స్ర్కీన్‌షాట్‌ తీసి నేరుగా జొమాటోకే ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. నాలుగేళ్ల నా కొడుకు అమాయకత్వంతో జొమాటోకు తనకు నచ్చిన వస్తువులు తెమ్మని మెసేజ్‌ చేశాడు' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఆ చిన్నారి తండ్రి ట్వీట్‌కు వెంటనే జొమాటో స్పందించి ఆ బుడ్డొడికి కావల్సిన బొమ్మలు పంపి ఆ పిల్లడి కోరిక తీర్చింది.

మరోసారి ఆ బాలుడి తండ్రి ట్విటర్‌లో పేర్కొంటూ.. తన కుమారుడికి జొమాటో బొమ్మలు పంపించి తనను ఆశ్చర్యానికి గురిచేసిందని రీ పోస్ట్‌ చేశారు. జొమాటో వారు తమ బాలుడి కోరిక మర్నించి వాటిని తెచ్చి ఇవ్వడంతో వాటితో ఇప్పుడు మా బాలుడు చాలా ఆనందానికి ఆడుకుంటున్నాడని ఆనందం వ్యక్తి చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇక ట్వీట్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ బాలుడు చేసిన మొసెజ్‌కి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ బాలుడి కోరిక తీర్చిన జొమాడు ప్రత్యేక ధన్యవాదలు అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఒక బాలుడి మొసెజ్ అందరిని ఆకట్టుకుంటోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories