Ice Cream: ఐస్ క్రీం ఖరీదు రూ.5లక్షలు..ఎందుకంత స్పెషల్ అంటే?

Worlds Most Expensive Ice-cream Costs Rs 5 Lakh
x

Ice Cream: ఐస్ క్రీం ఖరీదు రూ.5లక్షలు..ఎందుకంత స్పెషల్ అంటే?

Highlights

*ఐస్ క్రీమ్..చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు. వేసవి సీజన్ లో అయితే కడుపు చల్లగా ఉండాలంటూ కప్పు మీద కప్పు లాగించేస్తాం..కానీ, ఈ ఐస్ క్రీమ్ తినాలంటే మాత్రం మీరు పెట్టి పుట్టాల్సిందే..బిలియనీర్లకే సొంతమైనా ఆ ఐస్ క్రీమ్ ప్రత్యేకత ఏంటంటే..

Ice Cream: ఐస్ క్రీమ్..చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు. వేసవి సీజన్ లో అయితే కడుపు చల్లగా ఉండాలంటూ కప్పు మీద కప్పు లాగించేస్తాం..కానీ, ఈ ఐస్ క్రీమ్ తినాలంటే మాత్రం మీరు పెట్టి పుట్టాల్సిందే..బిలియనీర్లకే సొంతమైనా ఆ ఐస్ క్రీమ్ ప్రత్యేకత ఏంటంటే..

ఐస్ క్రీం అంటే అందరికీ ఇష్టమే..సమ్మర్ సీజన్ లో అయితే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్లు సైతం ఐస్ క్రీం తినేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఐస్ క్రీమ్ లేకుండా వేడుక ఉండదంటే అతిశయోక్తి కాదు. ఏదైనా ఫంక్షన్ కు వెళ్లినప్పుడు ఐస్ క్రీమ్ స్టాల్ ఎక్కడుందా అని మనలో చాలామంది వెతికే ఉంటాం..సాధారణంగా ఐస్ క్రీమ్ ధర ఎంత ఉంటుంది చెప్పండి..చీప్ గా అయితే రూ.10, కాస్ట్లీగా అయితే రూ.100..ఔనా, కానీ ఒక ఐస్ క్రీమ్ ధర వింటే మీరు ముక్కున వేలేసుకుంటారు. జపాన్ కు చెందిన సెలాటో ఒక స్పెషల్ ఐస్ క్రీమ్ తయారు చేసింది. దీని ధర 8,73,400 యెన్లు అంటే మన కరెన్సీలో చెప్పుకుంటే అక్షరాలా రూ.5.2 లక్షలు..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్ ఇదే..గిన్నిస్ సంస్థ ఈ ఐస్ క్రీమ్ ను గుర్తించి ఇదే కాస్ట్లీ ఐస్ క్రీమ్ అంటూ తన బుక్ లో చోటు కల్పించింది.

ఐస్ క్రీమ్ స్పెషాలిటీ ఏంటి..

ఈ ఐస్ క్రీంను చాలా అరుదైన పదార్థాలతో తయారు చేస్తారట. ఇటలీలో దొరికే తెల్లటి పుట్టగొడుగులను ఐస్ క్రీం తయారీకి ఉపయోగిస్తారు. కిలో తెల్లటి పుట్టగొడుగుల ధర రూ.12.50 లక్షల వరకు పలుకుతుందట. వైట్ ట్రఫుల్స్ అనే ఈ తెల్లటి పుట్టగొడుగులతో పాటు ఇటలీలో అరుదుగా లభించే చీజ్, జపాన్ లో లభించే సేక్ లీస్ అనే పదార్థంతో ఐస్ క్రీమ్ తయారు చేస్తారట. అందుకే ఈ ఐస్ క్రీమ్ కు అరుదైన రుచితో పాటు సువాసన ఉంటుందని చెబుతున్నారు. ఏదిఏమైనా, ఇంత కాస్ట్లీ ఐస్ క్రీమ్ తినాలంటే మాత్రం పెట్టి పుట్టాల్సిందే కదా.


Show Full Article
Print Article
Next Story
More Stories