Top
logo

వెబ్ ప్రపంచం పుట్టింటి అడ్రస్ www పుట్టినరోజు!

వెబ్ ప్రపంచం పుట్టింటి అడ్రస్ www పుట్టినరోజు!
X
Highlights

అరచేతిలో ప్రపంచం.. మునివేళ్ల పై సమాచారం.. ఇంకా చెప్పాలంటే సెకనులో పదో వంతులో ప్రపంచ సమాచారాన్ని ఒడిసిపట్టే అవకా...

అరచేతిలో ప్రపంచం.. మునివేళ్ల పై సమాచారం.. ఇంకా చెప్పాలంటే సెకనులో పదో వంతులో ప్రపంచ సమాచారాన్ని ఒడిసిపట్టే అవకాశం మన స్వంతం ఇప్పుడు. కానీ, సరిగ్గా.. ముప్ఫై ఏళ్ల క్రితం పక్క ఊరి విశేషాల కోసం కనీసం పది గంటలపాటైనా వేచి ఉండాల్సిన పరిస్థితి. దీనిని మార్చేశాయి మూడే అక్షరాలు. సమాచార విప్లవానికి నాంది పలికింది ఆ మూడు అక్షరాలే. అవే www. పూర్తిగా చెప్పాలంటే వరల్డ్ వైడ్ వెబ్. తెలుగులో పచ్చిగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్త సాలెగూడు.

అవును. ఇక్కడ హైదరాబాద్ లో కూచుని మీరు రాసే అక్షరం ప్రపంచం మొత్తం సెకన్లలో వెయ్యోవంతు సమయంలో చేరిపోతోందంటే.. ఆ సమాచార సాలెగూడు వల్లే. మీరు చేసిన ఓ వీడియో.. కళ్ళు మూసి తెరిచే లోపు లోకం చోట్టేసి వచ్చేస్తోందంటే.. అది ఈ www అనే సాలెగూడు వల్లే. ఈరోజు (ఆగస్టు 01) తో ఈ సమాచార సాలెగూడు పుట్టి మూడు దశాబ్దాలు పూర్తవుతోంది.

సరిగ్గా 30 ఏళ్ల క్రితం.. 1989లో టిం బెర్నేర్స్-లీ అనే ఆంగ్ల భౌతిక శాస్త్రవేత్త వరల్డ్ వైడ్ వెబ్ ను కనుగొన్నారు. ఆయన స్విట్జర్లాండ్లోని జెనీవాలో సెర్న్ (cern) అనే సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆయన పనిచేస్తున్నప్పుడు సహచరులతో కల్సి ఈ ప్రపంచపు సమాచార సాలెగూడు కనిపెట్టాడు. వీళ్ళంతా కల్సి ఒక ప్రోటోకాల్ వ్యవస్థ రూపొందించారు. అదే మనం HTTP గా పిల్చుకునే Hyper Text Transfer Protocol. ఇది ప్రపంచంలోని అన్ని కంప్యూటర్ సర్వర్లనీ.. క్లయింట్లనీ ప్రామాణిక సమాచార వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చింది. అయితే, దీనిని సామాన్య వాడకంలోకి తీసుకురావడానికి మాత్రం వారికి మరో రెండున్నరేళ్ళు పట్టింది. పూర్తి స్థాయిలో 1992 జనవరిలో ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే, డిసెంబర్ 1994లో వచ్చిన కొత్త ఆవిష్కరనలతో వరల్డ్ వైడ్ వెబ్ (www) తరువాత సంవత్సరానికల్లా మిలియన్ల మందికి చేరుకుంది. ఇక తరువాత దశాబ్దంలో ఈ సమాచార విప్లవం సాధించిన ప్రగతి మనకందరికీ తెలిసిందే. అయితే, ఈ విప్లవ ప్రగతికి పూర్తి ఆధారం www.

సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1995లో ఇంటర్నెట్ అప్లికేషన్లకి సహాయకారిగా ఉండేలా స్వంత వెబ్ బ్రౌజర్ ని అభివృద్ధి చేసింది. దీనిని విండోస్-95 కి అనుసందానించింది. అంటే విండోస్ కొనుకున్న వినియోగదారునికి www సర్వీసులను కూడా కలిపి అందించే వ్యవస్థ రూపొందించింది. అక్కడ నుంచి క్రమేపీ మైక్రోసాఫ్ట్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇప్పటికీ తన ప్రస్థానం కొనసాగిస్తోంది.

ప్రపంచంలో చాలా వెబ్ సైట్ లు www తోనే ప్రారంభం అవుతాయి. తరువాత డొమైన్ పేరు వస్తుంది. ఉదాహరణకి..www.example.com ఇంకా వరల్డ్ వైడ్ వెబ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నప్పటికీ.. www లేకుండా వెబ్ ప్రపంచంతో కలవడం.. అంత సులభం కాదు.

ఈ రోజు www డే సందర్భంగా అంతర్జాలంతో పనిచేసే అందరికీ శుభాకాంక్షలు అందిస్తోంది hmtv.

Next Story