World Water Day: మంచు కరిగిపోతోంది.. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా తెలుసుకోవాల్సిన భయంకర నిజాలు!

World Water Day 2025
x

World Water Day: మంచు కరిగిపోతోంది.. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా తెలుసుకోవాల్సిన భయంకర నిజాలు!

Highlights

World Water Day 2025: గ్లేసియర్లు కరిగిపోతే, భూమి నీటి మూలాలను కోల్పోతుంది. ప్రపంచ నీటి దినోత్సవం 2025 థీమ్ ఈ సారి 'గ్లేసియర్ పరిరక్షణ..'

World Water Day 2025: ఎక్కడో కదులుతున్న మంచు కొండలు కరగిపోతే మనకి వచ్చే నష్టమేంటిలే అనుకోవద్దు..! ఇప్పటికీ అలానే మీరు భావిస్తే అది మీ భ్రమే అవుతుంది. గ్లేసియర్లు కరిగిపోతున్న వేగం చూస్తుంటే.. భూమి భవిష్యత్తు ప్రశ్నార్థకమే అనిపిస్తోంది. ఓవైపు సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి.. మరోవైపు మానవ వనరులు ముంపుకు గురవుతున్నాయి. తాగునీటి మూలాలు ఎండిపోతున్నాయి. ఇది భవిష్యత్‌లో సంభవించబోయే సంఘటన కాదు.. ఇది ఇప్పుడే జరుగుతున్న వాస్తవం!

ప్రపంచం నీటి కోసం తన్నుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మనకి కనిపించని దూరాల్లో ఉన్న మంచు కొండలే అసలు మన జీవానికి మూలం. అవి కరిగిపోతే నీటి కొరతతో పాటు వరదల బీభత్సం ఉంటుంది. అందుకే గ్లేసియర్స్‌ను రిక్షించుకోవడం అన్నిటికంటే ముఖ్యం. అందుకే ఈ ఏడాది ప్రపంచ నీటి దినోత్సవానికి(మార్చి 22) 'గ్లేసియర్ పరిరక్షణ' అనే థీమ్ ఇచ్చారు. ఇది నిజానికి ఒక్క నినాదం కాదు.. ప్రపంచానికి భారీ హెచ్చరిక.

1993లో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రారంభించినప్పటి నుంచి.. ప్రతి ఏడాది నీటి ప్రాముఖ్యతను వివరిస్తు ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అటు భవిష్యత్ తరాల కోసం ఇప్పటికే నీటి ఉద్యమాలు నడుస్తున్నాయి. గ్లేసియర్లు కేవలం మంచుతో నిండి ఉన్న కొండలు కావు. అవి భూమికి ఊపిరిలాంటి మూలాలు. వాటిని కాపాడటమే జీవం కాపాడటానికి వేసే ముందడుగు.

భౌగోళికంగా చూస్తే, ప్రపంచంలో తాగునీటి కీలక మూలాల్లో గ్లేసియర్లు 69 శాతం వాటా కలిగి ఉన్నాయి. హిమాలయాల నుంచి ఆండీస్ వరకు ఉన్న ఈ మంచు కొండలు లక్షల కోట్ల మందికి జీవనాధారం. ఇవి కరిగిపోతే, ఏకంగా పది కోట్ల మందికి పైగా జీవించడానికి అవసరమైన నీటి మాధ్యమం కరువవుతుంది. శీతలీకరణ శక్తిగా పని చేసే గ్లేసియర్లు లేకపోతే, వాతావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రపంచదేశాలు నిద్రలేవాలి!

Show Full Article
Print Article
Next Story
More Stories