Top
logo

ఆమె శరీరంలో అన్నీ ప్లాస్టిక్ అంగాలే! ఇంకా మార్చుకోవాల్సినవి వున్నాయట!!

ఆమె శరీరంలో అన్నీ ప్లాస్టిక్ అంగాలే! ఇంకా మార్చుకోవాల్సినవి వున్నాయట!!
X
Highlights

కొంత మందికి శరీరం మీద విపరీతమైన వ్యామోహం ఉంటుంది. ఈ ముద్దు గుమ్మకూ అంతే.. కాకపొతే, అది పీక్స్ లో ఉంది. అందుకే శరీరాన్ని కాన్వాసు గానూ, ప్లాస్టిక్ సర్జరీ ని కుంచె గానూ మార్చేసుకున్నాను అని చెబుతోంది.

ఎవరి వెర్రి వారికానందం అంటే ఇదే. అందం అంటే ఇష్టం ఉండొచ్చు.. కానీ పిచ్చి ఉండకూడదు. అయితే, ఈ భామకు పిచ్చి.. వెర్రి ఇంకా చాలా ఉన్నాయి. తన ముక్కు నుంచి.. మూతి వరకూ.. వక్షోజాల నుంచి పిరుదుల వరకూ అన్నిటినీ ప్లాస్టిక్ సర్జరీ తో తీర్చి దిద్దుకుంది. ఆ పిచ్చి అమ్మాయి గురించి తెలుసుకోవాలనుందా.. ఇంకెందుకు ఆలస్యం ఈ కథనం చదివేయండి మరి!

ఈ అమ్మడు అమెరికాలోని వర్జీనియాలో ఐటీ స్పెషలిస్ట్ గా పనిచేస్తోంది. పేరు క్రిస్టెన్ స్పీడర్. వయసు 28 ఏళ్ళు. తొమ్మిదేళ్లుగా ఆమె తన అందాల్ని ప్లాస్టిక్ సర్జరీతో మార్చుకునే పనిలోనే ఉంది. దానికి ఆమె జస్ట్ 1.28 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అంతే. ఆమె నుదురు.. ముక్కు.. పెదవులు.. ఇవన్నీ మార్చుకుంది. అయినా తన అందం మీద తనకు తృప్తి రాలేదు. దాంతో.. పక్కటెముకలు కూడా మార్పించేసుకుంది. వీటితో పాటు వక్షోజాలను ఇంప్లాంట్ చేయించుకుంది. పిరుదులను షేప్ చేయించుకుంది. ఇన్ని చేయించుకున్నా ఈ ముద్దుగుమ్మకి తన అందం విషయంలో ఇంకా కొద్ది అసంతృప్తి ఉందట దానిని కూడా సరిచేయిన్చుకోవడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తోంది. దానికోసం మరో 20 లక్షలు ఖర్చు అవుతాయని చెబుతోంది.

ఇంతకీ ఎందుకిలా అని అడిగిన వారికి ఆమె చెప్పే సమాధానం విని నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదట. ''స్కూల్‌లో నిత్యం నన్ను ఆటపట్టించేవారు. దాని వల్ల ఇతరులు ఏమనుకున్నా పట్టించుకోకూడదనే విషయాన్ని నేర్చుకున్నాను. అందుకే, నాకు నచ్చినట్లుగా నేను ఉంటున్నాను. శరీరాకృతులను మార్చుకుంటున్నా. అద్దంలో చూసుకున్నప్పుడు నా శరీరం నాకు నచ్చేది కాదు. ఆ నచ్చని భాగాలను ప్లాస్టిక్ సర్జరీతో మార్చుకోవడం అలవాటు చేసుకున్నా'' అంటూ ఆమె ఇచ్చిన సమాధానానికి ఎవరికీ ఏమనాలో అర్థం కావడం లేదట. ఆఖరికి ఆమె తల్లిదండ్రులతో సహా. వారైతే ఈ పిచ్చితో తమ కూతురు ఏమైపోతుందో అనే బెంగతో సగం చచ్చిపోతున్నామని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి.. బజారులో బట్టలిప్పేసిన మహిళ


క్రిస్టన్ తన తొలి ప్లాస్టిక్ సర్జరీని 18 ఏళ్ల వయస్సులో చేయించుకుంది. మొదటగా చిన్నగా ఉన్న తన వక్షోజాలను 550సీసీ ఇంప్లాంట్స్‌తో గుండ్రంగా 32B సైజుకు మార్చుకుంది. ఇందుకు అప్పట్లో రూ.6.15 లక్షలు వెచ్చించింది. ఇక అక్కడ నుంచి మొదలు పెట్టి ఇంత ఖర్చు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది.

ఇంకా ఆమె ఏమంటుందో తెలుసా.. ''నా శరీరాన్ని నేను క్యాన్వస్‌గా భావిస్తాను. నా ఆకృతులను మార్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీని కుంచెలా భావిస్తాను'' అని సెలవిస్తోంది. దీంతో ఈ పిచ్చికి అంతు లేదని అందరూ ఫిక్స్ అయిపోయారు.

మొత్తమ్మీద అందం కోసం సైన్స్ ను విచ్చల విడిగా వాడేసుకుంటున్న ఈ భామ భవిష్యత్తులో అందానికి నిర్వచనం గా నిలుస్తుందో.. ఆ పిచ్చిలో మరోరకంగా మారిపోతుందో ఆ దేవునికే తెలియాలి.

మరిన్ని ఇటువంటి వింతలూ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Next Story