బజారులో బట్టలిప్పేసిన మహిళ

బజారులో బట్టలిప్పేసిన మహిళ
x
Highlights

ఉక్క పోసిందని బట్టలిప్పి బజారులో తిరిగిందో మహిళ. ఇటువంటి తిక్కపనులు చేస్తే కటకటాలు తప్పవని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

పట్టపగలు.. బజారులో ఓ మహిళ నగ్నంగా తిరిగితే.. మన దేశంలో అయితే పాపం పిచ్చిది అనుకుంటాం. కానీ అమెరికాలో అయితే, పొగరెక్కింది అని జైల్లో కూచోపెడతారు. సరిగ్గా అదే పని జరిగింది ఓ మహిళకు..

అమెరికాలోని టేనస్సీ రాజధాని నాష్విల్లెలో ప్రిన్సెస్ డెనిసే డే అనే 35 ఏళ్ల మహిళా నిర్వాకానికి పోలీసులు తలలు పట్టుకున్నారు. ఒకరోజు మధ్యాహ్న సమయంలో ఆమె బజారులో అకస్మాత్తుగా బట్టలన్నీ విప్పేసింది. నగ్నంగా తిరగడం మొదలెట్టింది. దీంతో అక్కడివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసు అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. దానికి ఆమె థలా తోకాలేని సమాధానాలిచ్చింది. ఎండగా ఉందని చెప్పినా, తన స్నేహితురాలు రమ్మందని బజారుకు వచ్చానని చెప్పింది.

ఆమె మద్యం తాగి ఉందేమోననే అనుమానంతో సంబంధిత పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అయితే, ఆమె మామూలుగానే ఉందని తేలింది. దీంతో బహిరంగ ప్రదేశంలో నగ్నంగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తోదని కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసు అక్టోబర్ నెలలో విచారణ జరుపుతారని పోలీసు అధికారులు చెప్పారు.

ఈ కథనం కూడా తప్పక చదవండి: నడిరోడ్డుపై లైవ్ లో తనని అక్కడ తాకి ముద్దు పెట్టిన ఆకతాయికి షాకిచ్చిన రిపోర్టర్


Show Full Article
Print Article
More On
Next Story
More Stories