ఇంత ప్రేమను తట్టుకోలేను బాబోయ్.. విడాకుల ఇచ్చేయండి..

ఇంత ప్రేమను తట్టుకోలేను బాబోయ్.. విడాకుల ఇచ్చేయండి..
x
Highlights

సాధారణంగా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక, అదనపు కట్నం కోసమో.. భర్త సరిగా చూసుకోవడం లేదని లేక రోజూ తాగివచ్చి కొడుతున్నాడనే నేపథ్యంలో ఏ భార్య అయినా కోర్టు మొట్టు ఎక్కి విడాకులు కోరుతుంది కదా! అయితే ఇప్పుడు చదవబోయే వార్త వింటే ఖచ్చితంగా కంగుతింటారు.

సాధారణంగా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక, అదనపు కట్నం కోసమో.. భర్త సరిగా చూసుకోవడం లేదని లేక రోజూ తాగివచ్చి కొడుతున్నాడనే నేపథ్యంలో ఏ భార్య అయినా కోర్టు మొట్టు ఎక్కి విడాకులు కోరుతుంది కదా! అయితే ఇప్పుడు చదవబోయే వార్త వింటే ఖచ్చితంగా కంగుతింటారు. ఎందుకంటే ఇక్కడ ఓ భార్య విడాకులు కోరిన విధానం అలాంటిది మరి. ఎందుకంటే తన భర్త అతి ప్రేమ తట్టుకోలేకపోతున్నానని తనకు విడాకులు కావాలని ఓ మహిళ కోర్టు మొట్లు ఎక్కింది. ఈ ఘటన యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌)లో జరిగింది. ఫుజిరహాలోని షారియా కోర్టులో బాధితురాలు వేసిన విడాకుల పిటిషన్‌ ద్వారా ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక అసలు విషయానికి వెళితే.. తన భర్త తనను అతిప్రేమగా చూసుకుంటున్నాడని,,, తమ ఇంట్లో బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఇంటి ముందు వాకిలి ఊడవడం ఇలా ప్రతి ఒక్క పనులు తనే చేస్తున్నడని.. అసలు తనను ఏ ఒక్క చిన్న పని కూడా చేయనివ్వడంలేదని కోర్టు ముందు వాపోయింది భాదితురాలు.

అయితే తమ పెళ్లైన కొత్తలో ఇలా చేస్తున్నాడనుకుంటే.. పెళ్లిఅయిపోయి ఏడాది దాటినా కానీ ఇలాగే కోనసాగించడం తనకు ఏ మాత్రం నచ్చలేదని స్పష్టం చేసింది. తాను ఏ చిన్న తప్పు చేసిన కొట్టకుండా, తిట్టకుండా చాలా ఒర్పుతో ఉంటడాని చెప్పుకొచ్చింది. అయితే తనతో ఒక్కరోజు కూడా గొడవ పడకపోగా.. ప్రతి రోజు ఏదో ఒక సర్‌ప్రైజ్ చేసేవాడని చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు తమ దాంపత్య జీవితం సాఫీగానే కొనసాగుతున్నట్లు వెల్లడించింది. కాని తన భర్త చూపించే అతి ప్రేమ, ఆప్యాయత, జాలీ తట్టుకోలేనని తనకు వెంటనే విడాకులు కావాలని భార్య కోర్టుకు విన్నబుచ్చుకుంది. అయితే దినికి తన భర్త జవాబిస్తూ తన భార్యని ఎంతో ప్రేమ, ఆప్యాయతతో చూసుకుంటే.. ఆమె వాటినే తప్పుబట్టడం చాలా బాధ కలిగిస్తోందని భర్త వాపోయాడు. నా భార్యఅంటే నాకు చచ్చేంత ప్రేమ.. తానే లేక నేను లేనంటూ కోర్టులోనే బోరునా ఎడ్చేశాడు. ఎలాగైన తన భార్య ఈ కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా సూచించాలని భర్త న్యాయస్థానానికి కోరాడు. కాగా, ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి భార్యభర్తల మధ్య అవగాహన కలిగేందుకు మరికొంత సమయం ఇచ్చారు. తదుపరి విచారణకు వాయిదా వేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories