Aurangzeb's tomb: శివాజీ మనవడు ఔరంగజేబు సమాధి వద్దకు ఎందుకు వెళ్లారు?

Aurangzebs tomb
x

Aurangzeb's tomb: శివాజీ మనవడు ఔరంగజేబు సమాధి వద్దకు ఎందుకు వెళ్లారు?

Highlights

Aurangzeb's Tomb: శహుజీ ఔరంగజేబ్ సమాధికి వెళ్లినది అనుబంధం కోసం కాదు.. తారాబాయి పై రాజ్యాధికారం సాధించేందుకు తాను వేసిన వ్యూహాత్మక అడుగు!

Why Shivaji grandson went on pilgrimage to Aurangzeb tomb

Aurangzeb's Tomb: ఒకవైపు తండ్రిని చంపినవాడు, మరోవైపు తనను చిన్న వయసులోనే పట్టుకొని 18 ఏళ్ల పాటు చెరసాలలో పెట్టినవాడు. అలాంటి ఔరంగజేబ్ సమాధికి శహుజీ వెళ్లడం విన్నప్పుడు, అందరికీ ఆశ్చర్యమే కలగడం సహజం. కానీ ఈ నడక వెనుక ఉన్న అర్థం కేవలం భావోద్వేగం కాదు... ఇది పూర్తిగా రాజకీయ వ్యూహం.

శివాజీ కుమారుడు శంభాజీని 1689లో ఔరంగజేబ్ పట్టుకొని దారుణంగా హత్య చేయించాడు. ఆ సమయంలో శంభాజీ కుమారుడు శహుజీ, అతని తల్లి సహా మొఘల్ చెరలోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచే శహుజీ 18 సంవత్సరాలు పెరిగాడు. 1707లో ఔరంగజేబ్ మరణించిన తర్వాత, అతని కుమారుడు ఆజమ్ షా, ఉత్తర భారతంలో సింహాసనం కోసం పోటీకి బయలుదేరే ముందు శహుజీని విడిచిపెట్టాడు. దీని వెనుక ఉన్న వ్యూహం.. మరాఠా సామ్రాజ్యంలో చీలిక తేవడం.

శహుజీ విడిపోవడం తర్వాత, తన పిన్ని తారాబాయి పాలిస్తూ ఉన్న మరాఠా సింహాసనాన్ని దక్కించుకునేందుకు పోరాటం ప్రారంభించాడు. తన స్థానాన్ని తిరిగి పొందాలంటే.. మొఘల్ పరంపరతో తన సంబంధాన్ని చాటుకోవాలి అనుకోవడం సహజం. అందుకే ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబ్ సమాధిని పాదయాత్రగా వెళ్లి దర్శించాడు. ఇది ఒక విధంగా మొఘల్‌-మరఠా రాజకీయ బంధానికి సంకేతం.

ఈ చర్యపై తారాబాయి శివిరం తీవ్ర విమర్శలు చేసింది. శహుజీపై 'ఇతడు మొఘల్ సంస్కృతిని అనుసరించిన వాడు' అంటూ ప్రచారం సాగింది. కానీ నిజంగా చూస్తే, శహుజీ తన శక్తిని నిలబెట్టుకోవడానికి, తారాబాయి వర్గాన్ని పక్కన పెట్టడానికి, మొఘల్‌ అనుకూలతను పొందడానికి చేసిన వ్యూహం ఇది. ఒకప్పుడు శత్రువైన వాడి సమాధికి వెళ్లడమే కాకుండా, అతని ముందు తలవంచడం అనేది వ్యక్తిగత బాధల కంటే.. రాజకీయ విజయం కోసం వేసిన బలమైన అడుగు.

Show Full Article
Print Article
Next Story
More Stories