Ice Cubes: నీటిలో మంచు ముక్క వేస్తే తేలుతుంది.. అదే ఆల్కహాల్లో వేస్తే మునిగిపోతుంది.. అసలు కారణం ఏంటో తెలుసా?

Why Ice Cubes Floating on Water And Sink in Alcohal Check the Reason
x

Ice Cubes: నీటిలో మంచు ముక్క వేస్తే తేలుతుంది.. అదే ఆల్కహాల్లో వేస్తే మునిగిపోతుంది.. అసలు కారణం ఏంటో తెలుసా?

Highlights

Ice Cubes: ఒక గ్లాసు నీటిలో మంచు ముక్క వేస్తే తేలుతుందని మనకు తెలుసు. కానీ అదే గ్లాసులో నీళ్లకు బదులు ఆల్కహాల్ ఉంటే, ఆ మంచు ముక్క అందులో మునిగిపోతుంది.

Ice Cubes: ఇది వేసవి కాలం. కొన్ని వస్తువులను చల్లబరచడానికి మంచు లేదా ఐస్‌ను ఉపయోగిస్తుంటాం. మనం తరచుగా నీటిని చల్లగా చేసేందుకు ఐస్‌లో వేస్తుంటాం. అయితే, ఒక గ్లాసు నీటిలో మంచు ముక్క వేస్తే తేలుతుందని మనకు తెలుసు. కానీ అదే గ్లాసులో నీళ్లకు బదులు ఆల్కహాల్ ఉంటే, ఆ మంచు ముక్క అందులో మునిగిపోతుంది. నీటిలో తేలికగా తేలియాడే మంచు ముక్క మద్యంలో ఎందుకు మునిగిపోతుంది అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఐస్ ముక్కకు కూడా మత్తు ఎక్కుతుందా ఏంటి అనిపిస్తుందా.. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సమాధానం భౌతికశాస్త్రంలో దాగి ఉంది..

వాస్తవానికి, ఈ ప్రశ్నకు సరైన సమాధానం భౌతిక శాస్త్రంలో కనుగొన్నారు. ఈ మొత్తం విషయం సాంద్రతతో కూడుకున్నది. మంచు సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్‌కు 0.917, నీటి సాంద్రత 1.0 క్యూబిక్ సెంటీమీటర్, అలాగే ఆల్కహాల్ సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్‌కు 0.789గా ఉంటుంది.

నీటిలో తేలుతుంది.. కానీ, మద్యంలో మునిగిపోతుంది..

మంచు సాంద్రత (0.917) నీటి సాంద్రత (1.0) కంటే తక్కువగా ఉంటుంది. ఇక ఆల్కహాల్ సాంద్రత (0.789) కంటే ఎక్కువగా ఉందని పై డేటా నుంచి తెలుసుకోవచ్చు. మంచు ముక్క నీటిలో తేలికగా ఉండి అందులో తేలడానికి కారణం ఇదే. కానీ, మంచు సాంద్రత ఆల్కహాల్ సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది దానిలో మునిగిపోతుంది.

మంచు నీటిలో, ఆల్కహాల్‌లో తేలడానికి, మునిగిపోవడానికి గల శాస్త్రీయ కారణం భౌతిక శాస్త్రం (సాంద్రత) తేల్చేసింది. ఇక్కడ సాంద్రత అనేది ఆ పదార్ధం అణువుల మధ్య దూరాన్ని సూచిస్తుంది. పెద్ద ఇనుప ఓడలు నీటిలో తేలతాయి. కానీ, చిన్న ఇనుప ముక్క నీటిలో మునిగిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories