12 Years for Whatsapp: వాట్సప్ కు 12 ఏండ్లు

Whatsapp 12th Year Anniversary
x

వాట్సప్ (ఫోటో ట్విట్టర్ )

Highlights

12 Years for Whatsapp: నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పాపులర్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్.

12 Years for Whatsapp: ప్రపంచంలోనే పాపులర్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్.. నేటితో (గురువారం) 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మేరకు ట్విట్టర్ లో తన 12 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ట్వీట్ చేసింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌‌బుక్ యాజమాన్యం తీసుకున్న తర్వాత మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ప్రతిరోజూ ఒక బిలియన్ కంటే ఎక్కువ కాల్స్ వాట్సప్ నుంచి వెళ్తున్నట్లు వెల్లడించింది.

వాట్సాప్ ఫిబ్రవరి 2009 లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇన్‌స్టాంట్ మెసింగ్ లో అప్పట్లో పోటీ లేకపోవడంతో వాట్సప్ కు ఎదురు లేకుండా పోయింది. అనంతరం వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లను అందిస్తూ..మరింత ముందుకు సాగుతోంది. 2015లో ఆడియో కాల్స్, 2016 లో వీడియో కాల్స్ ను ప్రారంభించడంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఫోన్ లో వాట్సప్ ఉండాల్పిందే అన్నంతగా మారిపోయింది.

2018 లో గ్రూప్ వాయిస్, వీడియో కాల్స్ ప్రారంభించి యూజర్లకు మరింత చేరువైంది. అయితే, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా..ఇటీవల ప్రైవసీ విధానంలో కొత్త రూల్స్ తెస్తున్నట్లు ప్రకటించింది. దీంతో యూజర్ల ఆగ్రహానికి గురైంది. ఫేస్ బుక్ తో ప్రైవసీ డేటాను షేర్ చేసుకుంటుందని యూజర్లు వాపోతుండడం వాట్సప్ కి కొంత నష్టం కలిగించింది. కొత్త ప్రైవసీ రూల్స్ ను మే 15 న అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. నూతన పాలసీని అంగీకరించకపోతే మే 15 నుంచి యూజర్లు మెసేజ్‌లు, కాల్స్ చేసుకోవడం కుదరదని వాట్సప్ ప్రకటించింది.

అయితే, కొత్త విధానంలో భారత్ ప్రభుత్వం రూపొందించిన అన్ని గైడ్ లైన్స్ ను అనుసరించామని వాట్సప్ ప్రకటించినా..యూజర్లు మాత్రం ఇతర యాప్ లపైనే ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే భారత ప్రభుత్వం కూడా వాట్సప్ కు పోటీగా సందేశ్ అనే యాప్ ను తీసుకొచ్చింది.

వాట్సప్ తో ప్రపంచంలోని స్నేహితులకు, బంధువులకు మెసేజ్, వీడియో కాల్స్ తో అందుబాటులో ఉండడంతో అందరికి చేరువైంది. అలాగే ప్రపంచంలో ఏంజరిగినా వెంటనే అందరికీ షేర్ చేసేలా ఉండడం వాట్సప్ ను ముందుండేలా చేసింది. అయితే, ఫేక్ వార్తలతో చాలా విమర్శలను కూడా ఎదుర్కొంది వాట్సప్. ఫేక్ వార్తల కట్టడికి సరైన ప్రణాళిక లేకపోవడం వాట్సప్ కు పెద్ద మైనస్ గా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories