Viral Video: జంగిల్‌ సఫారీలో షాకింగ్ సీన్‌.. 13 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి!

Viral Video: జంగిల్‌ సఫారీలో షాకింగ్ సీన్‌.. 13 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి!
x

Viral Video: జంగిల్‌ సఫారీలో షాకింగ్ సీన్‌.. 13 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి!

Highlights

రోజువారీ ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం చాలామంది జంగిల్ సఫారీకి వెళ్తారు. అయితే అలాంటి ట్రిప్ ఒక కుటుంబానికి భయానక అనుభవంగా మారింది. బెంగళూరులోని బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్లో జంగిల్ సఫారీ సమయంలో 13 ఏళ్ల బాలుడిపై చిరుతపులి దాడి చేసిన ఘటన జరిగింది.

ఒక కుటుంబం తమ కుమారుడితో కలిసి సఫారీకి వెళ్ళింది. బాలుడు కిటికీ నుండి చిరుతను చూస్తుండగా, డ్రైవర్ కారు నెమ్మదిగా నడిపిస్తూ పర్యాటకులకు జంతువును చూపించాడు. అయితే చిరుత ఒక్కసారిగా కారు వైపు దూసుకొచ్చి కిటికీ వద్దకు ఎగిరి, తన పంజాతో బాలుడిపై దాడి చేసింది. ఈ దాడి కేవలం 4 సెకన్లపాటు మాత్రమే సాగినా, అందరినీ షాక్‌కు గురి చేసింది. వెంటనే డ్రైవర్ కారు వేగంగా ముందుకు తీసుకెళ్లగా చిరుత కొంతసేపు వెనుకా పరిగెత్తింది.

ఈ ఘటనలో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ దాడి దృశ్యాలు వెనుక కారులో ఉన్న మరో పర్యాటకుడి కెమెరాలో రికార్డయ్యాయి. దాదాపు 31 సెకన్ల ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చిరుత కారు మీదకు దూకి బాలుడిని గాయపరిచిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఘటన తర్వాత బాలుడి చేతిపై గాయాల ఫోటోను కూడా నెటిజన్లు షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోకు 2.3 లక్షలకుపైగా వీక్షణలు, వందల కొద్దీ లైక్‌లు, కామెంట్స్ వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories