వొడాఫోన్ యూజర్లకు శుభవార్త : రోజూ 2జీబీ డేటా ఫ్రీ...

వొడాఫోన్ యూజర్లకు శుభవార్త : రోజూ 2జీబీ డేటా ఫ్రీ...
x
VodaFone (File Photo)
Highlights

వొడాఫోన్ వినియోగదారులకు శుభవార్త తెలియజేస్తుంది వోడానెట్ వర్క్.

వొడాఫోన్ వినియోగదారులకు శుభవార్త తెలియజేస్తుంది వోడానెట్ వర్క్. తమ యూజర్లకు ప్రతి రోజు 2జీబీ ఉచిత డేటాను, అన్ లిమిటెడ్ కాల్స్ ను అందించి కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇండ్లలోనే ఉంటూ సమయం గడిపే వారికి ఈ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక వోడాఫోన్ ప్రవేశపెట్టిన ఆ అవకాశాన్ని ఇప్పటికే చాలా మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు.

కాకపోతే ఈ అద్భుతమైన ఆఫర్ ని వోడాఫోన్ కేవలం 7రోజులు మాత్రమే అందిస్తుంది. అది కూడా లక్ ఉన్న కొంత మంది యూజర్లకు మాత్రమే ఈ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. మరి మీరు కూడా ఆ బెనిఫిట్స్ ని పొందే జాబితాలో ఉన్నారో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా యూజర్లు 121363 నెంబర్‌కు డయల్ చేయాలి. ఒక వేళ మీరు గనుక ఈ ఆఫర్‌కు ఎలిజిబుల్ అయితే మీకు కంపెనీ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. లేదంటే వాయిస్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీ నంబర్ బెనిఫిట్స్ ని పొందే జాబితాలో ఉందో లేదో తెలుసుకోండి. ఇక వోడాఫోన్ అందించే మరికొన్ని ప్లాన్స్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వొడాఫోన్ వెబ్‌సైట్ లేదా యాప్ చూడండి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories