Viral Video: పెళ్లి వేదికపై ఆశ్చర్యకరమైన సంఘటన.. AI వీడియో అస్సలు కాదండోయ్‌..!

Viral Wedding Video Unbelievable Moment Caught on Camera
x

Viral Video: పెళ్లి వేదికపై ఆశ్చర్యకరమైన సంఘట.. AI వీడియో అస్సలు కాదండోయ్‌..!

Highlights

Viral Video: వివాహం అంటేనే ఓ పెద్ద ఉత్సాహం. మనిషి తన జీవితంలో ఒకేసారి చేసుకోవాలని కోరుకునే వేడుక. అందుకే వివాహాన్ని వీలైనంత వరకు అట్టహాసంగా జరుపుకోవాలని ఆశిస్తుంటారు.

Viral Video: వివాహం అంటేనే ఓ పెద్ద ఉత్సాహం. మనిషి తన జీవితంలో ఒకేసారి చేసుకోవాలని కోరుకునే వేడుక. అందుకే వివాహాన్ని వీలైనంత వరకు అట్టహాసంగా జరుపుకోవాలని ఆశిస్తుంటారు. అందుకోసం అన్ని రకాల ఏర్పాట్లను చేసుకుంటాడు. అయితే వివాహ వేడుకలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో అంతలా ఏముందనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరిలోకి వెళ్లాల్సిందే..

ఓ జంట బంధువుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇదే సమయంలో దండలు మార్చుకున్న తర్వాత వధువు ఓ బంగారు గొలుసును వరుడి మెడలో వేసింది. ఇలా ఇద్దరూ నవ్వుతూ సంతోషంగా ఉన్నారు. ఇదే సమయంలో కెమెరా మెన్‌ వెనకాల ఉన్న మరో జంటను జూమ్‌ చేశాడు. అక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. పెళ్లి పీటలపై ఉన్న జంటను పోలిన వ్యక్తులు వెనకాల నిల్చున్నారు. ఈ కారణంగానే ఈ వీడియో వైరల్ అవుతోంది.

అసలు విషయం ఏంటంటే అక్కడ రెండు వివాహాలు జరిగాయి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఒకే పోలికలతో ఉండడం, పెళ్లి చేసుకోవడం చాలా అరుదైన సంఘటన. ఇద్దరు కవలల వివాహం ఒకే రోజున నిర్వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు స్పందిస్తూ చూడ్డానికి అందంగా బాగానే కనిపిస్తున్నా జీవితంతం వీళ్లని చూసే వారు కన్ఫ్యూజ్‌కి గురికావడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ఈ వీడియోను సుమారు లక్ష మంది వరకు వీక్షించారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories