Viral Video : కారు బోనెట్‌పై కూర్చుని దోస్తుకి దారి చూపిన కుర్రాడు..వైరల్ వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్

Viral Video : కారు బోనెట్‌పై కూర్చుని దోస్తుకి దారి చూపిన కుర్రాడు..వైరల్ వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్
x

Viral Video : కారు బోనెట్‌పై కూర్చుని దోస్తుకి దారి చూపిన కుర్రాడు..వైరల్ వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్

Highlights

ప్రస్తుతం ఉత్తర భారతదేశాన్ని వణికించే చలి, కమ్మేస్తున్న పొగమంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రోడ్లపై అడుగు తీసి అడుగు వేయాలంటే భయం వేసేలా జీరో విజిబిలిటీ ఉంది.

Viral Video : ప్రస్తుతం ఉత్తర భారతదేశాన్ని వణికించే చలి, కమ్మేస్తున్న పొగమంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రోడ్లపై అడుగు తీసి అడుగు వేయాలంటే భయం వేసేలా జీరో విజిబిలిటీ ఉంది. ఇలాంటి ప్రాణసంకటమైన పరిస్థితుల్లో కూడా కొందరు యువకులు సరదా కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే, వీళ్లకి ధైర్యం ఎక్కువో లేక తెలివి తక్కువో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కారు దట్టమైన పొగమంచులో నెమ్మదిగా వెళ్తోంది. కారు హెడ్ లైట్లు ఆన్ లో ఉన్నా సరే, ముందున్న దారి అస్సలు కనిపించడం లేదు. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా కారు పక్కన ఆపి మంచు తగ్గే వరకు వేచి చూస్తారు. కానీ, ఈ యువకులు మాత్రం ఒక వింత ఐడియా వేశారు. ఒక యువకుడు ఏకంగా కారు బోనెట్‌పై కూర్చుని, లోపల ఉన్న డ్రైవర్‌కు చేతి సైగలతో దారి చూపించడం మొదలుపెట్టాడు. ఎడమకి వెళ్ళు, కుడికి వెళ్ళు అంటూ ఆ చలిలో బోనెట్‌పైనే తిష్ట వేశాడు.


వీడు మామూలోడు కాదు.. హ్యూమన్ ADAS

ఈ వీడియో తీస్తున్న వ్యక్తి సరదాగా తన స్నేహితుడిని మోడ్రన్ కార్లలో ఉండే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్(ADAS) టెక్నాలజీతో పోల్చాడు. "మా దగ్గర లెవల్-4 ఏడీఏఎస్ ఉంది. దారి కనిపించకపోతే మా హ్యూమన్ రాడార్ చూసుకుంటుంది" అంటూ కామెంట్ చేశాడు. అయితే, ఈ జోక్ నెటిజన్లకు మాత్రం అస్సలు నచ్చలేదు. కారు పొరపాటున ఒక్కసారిగా బ్రేక్ వేసినా లేదా దేన్నైనా ఢీకొట్టినా, బోనెట్‌పై ఉన్న యువకుడు నేరుగా కిందపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

నెటిజన్ల ఫైర్ - కోటికి పైగా వ్యూస్

ఈ వీడియో ఇప్పటికే కోటి మందికి పైగా వీక్షించారు. కానీ కామెంట్ సెక్షన్‌లో మాత్రం యువకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "ఇది తెలివితేటలు కాదు, పక్కా మూర్ఖత్వం" అని ఒకరు కామెంట్ చేయగా, "ప్రమాదం జరగకపోయినా, ఆ చలికి గడ్డకట్టుకుపోయి చనిపోయేలా ఉన్నాడు" అని మరొకరు ఎద్దేవా చేశారు. రీల్స్ పిచ్చితో ఇలాంటి ప్రాణాంతకమైన స్టంట్లు చేయడం వల్ల ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని రోడ్డు భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories