Viral Video: 'తప్పుకోగలవ్, కానీ తప్పించుకోలేవ్'.. కర్మ అంటే ఇంతేనేమో.?

Viral Video: తప్పుకోగలవ్, కానీ తప్పించుకోలేవ్.. కర్మ అంటే ఇంతేనేమో.?
x
Highlights

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతీ రోజూ ఏదో ఒక వీడియో వైరల్‌ అవుతూనే ఉంది. వీటిలో కొన్ని సమాచారాన్ని అందించేవి ఉంటే మరికొన్ని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతీ రోజూ ఏదో ఒక వీడియో వైరల్‌ అవుతూనే ఉంది. వీటిలో కొన్ని సమాచారాన్ని అందించేవి ఉంటే మరికొన్ని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందీ వీడియో. ఇంతకీ ఈ వీడియోలో అంతలా ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

మనలో చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. అంటే ఒక పని నుంచి మనం ఎంత తప్పించుకోవాలనుకున్న అది మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. ప్రమాదాలు కూడా అంతే ఎక్కడో మూలన దాగి ఉన్నా కూడా ప్రమాదం వెంటాడుతూనే ఉంటుంది. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియోలో ఇలాంటి సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో అటుగా ఓ యువతి స్కూటీ నడుపుతూ వెళ్తోంది.

అయితే ఏమైందో ఏమో ఒక్కసారిగా ఆ వ్యక్తిని వెనకాల నుంచి డ్యాష్‌ ఇచ్చింది. అయితే స్కూటీ స్లోగా ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే వెంటనే స్వారీ చెప్పింది. దీంతో ఆ వ్యక్తి మళ్లీ కాస్త ముందుకు వెళ్లాడు. అక్కడే యూ టర్న్‌ తీసుకునేందుకు ప్రయత్నించిన ఆ యువతి మళ్లీ వేగంగా వెళ్లి అదే వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతను ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది.

ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వీడియో కాస్త వైరల్‌ అవ్వడం మొదలు పెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను ఓ వ్యక్తి పోస్ట్‌ చేస్తూ.. ‘‘కర్మ వెంటాడుతుంది.. తప్పుకోగలవు, కానీ తప్పించుకోలేవు’’ అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. నిజంగానే ఈ వీడియో చూస్తే.. ఆ క్యాప్షన్‌ పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అవుతుందని అనిపిస్తుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories