Viral Video: ఒకేసారి రెండు ఎలుకలను తింటున్న 2 తలల పాము.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Viral Video Two Headed Snake Eating Two Mice at Once Shocking Footage
x

Viral Video: ఒకేసారి రెండు ఎలుకలను తింటున్న 2 తలల పాము.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Highlights

Viral Video: సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్‌ అవుతూనే ఉంటుంది. వీటిలో ప్రధానంగా కనిపించేవి పాములకు సంబంధించినవే.

Viral Video: సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్‌ అవుతూనే ఉంటుంది. వీటిలో ప్రధానంగా కనిపించేవి పాములకు సంబంధించినవే. పాము అంటే భయపడే జనం వాటి వీడియోలను చూడడానికి మాత్రం ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే సోషల్‌ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే ట్రెండ్ అవుతోంది.

రెండు తలల పాము గురించి చాలా మంది వినే ఉంటారు. కానీ వాటిని నేరుగా చూడడం చాలా అరుదనే చెప్పాలి. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు తలల పాము వీడియో ఒకటి హల్చల్‌ చేస్తోంది. అమెరికాకు చెందిన బ్రియాన్ బార్జిక్ నిర్వహిస్తున్న @snakebytestv అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ పాము అరుదైన కాలిఫోర్నియా కింగ్‌స్నేక్‌గా చెబుతున్నారు.

రెండు తలల పాము ఒకేసారి రెండు ఎలుకలను తినేందుకు ప్రయత్నిస్తున్న వీడియోను పోస్ట్‌ చేశారు. అయితే రెండు నోట్లలో రెండు ఎలుకలను కరుచుకున్న పాము వాటిని మింగేందుకు మాత్రం కష్టపడుతుంది. కారణం తలలు రెండు ఉన్నా వాటికి గొంతు మాత్రం ఒకటే ఉండడం. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షల మంది చూశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలు కామెంట్స్‌ చేస్తున్నారు. రెండు తలల పాము ఆహారం కోసం ఒక దాంతో మరొకటి పోటీ పడతాయా.? అసలు ఇవి ఎలా జీవిస్తాయంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories