Viral Video: ఇది చూస్తే వణుకు పుట్టాల్సిందే.. భయానక వీడియో వైరల్‌

Viral Video: ఇది చూస్తే వణుకు పుట్టాల్సిందే.. భయానక వీడియో వైరల్‌
x

Viral Video: ఇది చూస్తే వణుకు పుట్టాల్సిందే.. భయానక వీడియో వైరల్‌

Highlights

సోషల్ మీడియాను ఓ షాకింగ్ వీడియో కుదిపేసింది. ఈ వీడియోలో ఒక బైకర్‌ ఎంతో వేగంగా, ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేస్తూ కార్ల మధ్య అతి అరుదైన చతురతతో రైడ్‌ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

సోషల్ మీడియాను ఓ షాకింగ్ వీడియో కుదిపేసింది. ఈ వీడియోలో ఒక బైకర్‌ ఎంతో వేగంగా, ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేస్తూ కార్ల మధ్య అతి అరుదైన చతురతతో రైడ్‌ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోడ్డుపై ట్రాఫిక్ మధ్యలో అతను చేసే స్టంట్లు చూసినవారికి ముండె వణుకుతుంది. అతడి వేగం, తీరును బట్టి చూస్తే ఇది కేవలం తృటిలో తప్పిన ప్రమాదమే అని చెప్పవచ్చు.

ఒక క్షణం తేడా అంటే.. అతడి బైక్ కదులుతున్న కారును ఢీకొట్టేదే. కానీ అదృష్టవశాత్తూ అతడు సేఫ్‌గా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్న వారెందరో. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న కార్ డ్రైవర్ వెంటనే తన వాహనాన్ని ఆపి బైకర్‌ యోగక్షేమాలను అడిగాడు. బైకర్‌ కూడా "నేను బాగున్నాను" అంటూ సమాధానం ఇచ్చాడు.

అయితే, నిజంగా ఈ వీడియో చూసినవారిని నిజంగా అసహనానికి గురిచేసింది. ఎందుకంటే బైకర్‌ కేవలం ప్రయాణంలోనే లేడు, వీడియో తీయడంలో కూడా బిజీగా ఉన్నాడు. అతని స్టంట్లు, అతివేగ రైడింగ్‌ అన్నీ సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతోనే చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ పోకడ ప్రాణాలపై ఒక పెద్ద ప్రమాదం.

నెటిజన్లు మాత్రం ఘాటుగా స్పందిస్తున్నారు. "ఇలాంటి స్టంట్లు చేసేవారు తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు" అంటూ విరుచుకుపడుతున్నారు. ఇది మారాలి.. పబ్లిసిటీ కోసం ప్రాణాలతో చెలగాటం ఆపాలి అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం ఈ వీడియోను @DudespostingWs అనే ఖాతా నుండి షేర్ చేయగా, లక్షలాది మంది ఇప్పటికే వీక్షించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన రోడ్డుపై ఎలా ప్రవర్తించకూడదనే విషయానికి ఒక చేదు ఉదాహరణగా నిలిచింది.



Show Full Article
Print Article
Next Story
More Stories