Viral Video: అయ్యో.. మూతిపళ్లు ఉన్నయో రాలినయో పో… టిక్‌టాక్ ఛాలెంజ్‌లో షాకింగ్ ఘటన!

Viral Video: అయ్యో.. మూతిపళ్లు ఉన్నయో రాలినయో పో… టిక్‌టాక్ ఛాలెంజ్‌లో షాకింగ్ ఘటన!
x

Viral Video: అయ్యో.. మూతిపళ్లు ఉన్నయో రాలినయో పో… టిక్‌టాక్ ఛాలెంజ్‌లో షాకింగ్ ఘటన!

Highlights

వైరల్ అయ్యే పేరుతో ఒక టిక్‌టాక్ ఛాలెంజ్ మళ్లీ ప్రమాదానికి దారితీసింది. ఈసారి 32 ఏళ్ల రష్యన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మరియానా బరుత్కినా కేంద్రంగా ఉంది.

వైరల్ అయ్యే పేరుతో ఒక టిక్‌టాక్ ఛాలెంజ్ మళ్లీ ప్రమాదానికి దారితీసింది. ఈసారి 32 ఏళ్ల రష్యన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మరియానా బరుత్కినా కేంద్రంగా ఉంది. స్టిలెట్టో ఛాలెంజ్ అనే ట్రెండ్‌ను ఫాలో అవుతూ, తన కిచెన్ కౌంటర్‌పై హైహీల్స్‌లో నిలబడి బాడీ బ్యాలెన్స్ చేయడం ప్రయత్నించగా తీవ్రంగా గాయపడింది. తడబడిన ఆమె నేరుగా నేలపై వెల్లకిలా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె వెన్నెముకకు పగుళ్లు రావడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రమాదంగా మారిన రీల్

వీడియోలో మరియానా స్టైల్‌గా హైహీల్స్ వేసుకుని కౌంటర్‌పైకి ఎక్కి ఒక న్యూట్రిషన్ బాక్స్‌ను ఉపయోగిస్తూ బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నించింది. కానీ బ్యాలెన్స్ తప్పి గట్టిగా కింద పడిపోయింది. గర్భధారణ అనంతరం కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడంతో, ఆమె ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

నెటిజన్ల ట్రోలింగ్

ఈ వీడియో బయటకొచ్చిన తర్వాత, కొందరు నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తూ.. "ఇలాంటివి అవసరమా?" అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇటీవలే మాతృత్వాన్ని పొందిన తర్వాత ఇలాంటి రిస్క్ ఎందుకు తీసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల భద్రత గురించి కూడా నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆమె స్పందన ఇదే...

ఈ విమర్శలపై బరుత్కినా స్పందిస్తూ, తాను "కంప్రెషన్ బెండింగ్ ఇంప్లిమెంటబుల్ ఫ్రాక్చర్" అనే చిన్న ఫ్రాక్చర్‌కు గురైయ్యానని, ప్రస్తుతం కోలుకుంటున్నానని పేర్కొన్నారు. తన బిడ్డ పూర్తిగా సురక్షితంగా ఉన్నాడనీ, ఇద్దరు నానీలు ఉన్నారని కూడా తెలిపారు. తాను చేయబోయిన స్టంట్ పూర్తిగా ప్రణాళికాబద్ధమైనదే కానీ అదృష్టం కలిసి రాలేదని వివరించారు.

స్టిలెట్టో ఛాలెంజ్ అంటే ఏమిటి?

ఈ ఛాలెంజ్‌ 2013లో నిక్కీ మినాజ్ – లిల్ వేన్ కలిసి నటించిన High School మ్యూజిక్ వీడియోలోని ఓ సన్నివేశం ఆధారంగా పుట్టింది. ఇందులో మినాజ్ స్విమ్మింగ్ పూల్ అంచున స్టిలెట్టో హీల్స్ వేసుకుని బ్యాలెన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఆ సీనే ఇప్పుడు టిక్‌టాక్‌లో ట్రెండ్‌గా మారింది. అయితే ఇది చాలామందిని ప్రమాదంలో పడేస్తోంది.

సూచన: ఈ తరహా ట్రెండ్లను ఫాలో అవ్వడం కంటే, మీ భద్రతే ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories