Viral video: జెయింట్ వీల్‌కు వేలాడిన బాలిక... వీడియో వైరల్

Viral video: జెయింట్ వీల్‌కు వేలాడిన బాలిక... వీడియో వైరల్
x
Highlights

viral video of a girl dangling mid-air in Giant wheel: ఎగ్జిబిషన్‌లో జెయింట్ వీల్ ఎక్కిన 13 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు సీటు నుంచి జారి ఐరన్ రాడ్...

viral video of a girl dangling mid-air in Giant wheel: ఎగ్జిబిషన్‌లో జెయింట్ వీల్ ఎక్కిన 13 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు సీటు నుంచి జారి ఐరన్ రాడ్ పట్టుకుని వేలాడింది. దాదాపు 60 అడుగుల ఎత్తులో కొన్ని సెకన్ల పాటు బాలిక జెయింట్ వీల్ రాడ్ పట్టుకుని వేలాడుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాకేహ్తి గ్రామంలో తిరునాళ్లుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే అది ఎక్కిన బాలిక ఎక్కసారిగా కుదుపునకు గురైంది. దీంతో అమ్మాయి కూర్చున్న సీటు నుంచి జారిపోయింది.

జాయ్ రైడ్ రాడ్ ను ఆమె పట్టుకుని భయంతో అరుస్తూ 60 అడుగుల ఎత్తులో ప్రమాదకరంగా వేలాడింది. అది గమనించిన అక్కడి వారు జెయింట్ వీల్ ను మెల్లగా తిప్పి కిందకు చేర్చారు. దీంతో బాలిక సురక్షితంగా కిందకు దిగింది. దీనికి సంబంధించిన వీడియో డిసెంబర్ 5న ఎక్స్ లో పోస్ట్ అయింది. దీంతో ఇది వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన అధికారులు బాలికకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా భారీ జెయింట్ వీల్ ఏర్పాటు చేసిన నిర్వాహకులపై యాంక్షన్ తీసుకుంటామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories