Viral Video: ఇలాంటి బాధ ఏ తల్లికి రాకూడదు.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

Viral Video: ఇలాంటి బాధ ఏ తల్లికి రాకూడదు.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!
x

Viral Video: ఇలాంటి బాధ ఏ తల్లికి రాకూడదు.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

Highlights

హృదయాన్ని తాకే ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లా బరీ డ్రేన్ సమీపంలో జోహ్‌పారు – జైత్‌పూర్ రోడ్డుపై ఈ హృదయ విదారక ఘటన బుధవారం రాత్రి జరిగింది.

హృదయాన్ని తాకే ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లా బరీ డ్రేన్ సమీపంలో జోహ్‌పారు – జైత్‌పూర్ రోడ్డుపై ఈ హృదయ విదారక ఘటన బుధవారం రాత్రి జరిగింది.

ఓ తల్లి ఎలుగుబంటి తన రెండు పిల్లలతో రోడ్డు దాటుతుండగా, ఒక్కసారిగా ఒక వాహనం పిల్ల ఎలుగుబంటిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలవల్ల పిల్ల రోడ్డుపై కదలలేని స్థితిలో పడిపోయింది. ఆ బిడ్డను కాపాడటానికి తల్లి ఎలుగుబంటి తన ప్రాణాలకే తెగించి వాహనాల మధ్యలో నిలబడి, రోడ్డు దాటించడానికి ప్రయత్నించింది. కానీ పిల్ల ఎలుగుబంటి గాయాలు తీవ్రంగా ఉండటంతో చికిత్స పొందుతూ మరణించింది.

తల్లి ఎలుగుబంటి ఆ బిడ్డను వదలలేక రోడ్డుపై చాలా సేపు విలపిస్తూ నిలిచింది. ఈ దృశ్యం అక్కడి వారిని మాత్రమే కాదు, వీడియో చూసిన వేలాది మందిని కన్నీళ్లలో ముంచెత్తింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని గాయపడిన పిల్ల ఎలుగుబంటిని వైద్యం కోసం తీసుకెళ్లారు. కానీ ప్రాణాలు దక్కలేదు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, తల్లి ప్రేమ ఎంత గొప్పదో మరోసారి అందరికీ గుర్తు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories