Viral video: ఏం ట్యాలెంట్‌ గురూ.. టేబుల్‌ ఫ్యాన్‌ను ఏసీగా మార్చేశావుగా

Viral video: ఏం ట్యాలెంట్‌ గురూ.. టేబుల్‌ ఫ్యాన్‌ను ఏసీగా మార్చేశావుగా
x

Viral video: ఏం ట్యాలెంట్‌ గురూ.. టేబుల్‌ ఫ్యాన్‌ను ఏసీగా మార్చేశావుగా

Highlights

Viral video: ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంది.

Viral Video Man Turns Table Fan into DIY Air Conditioner with Ice

ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది ఏసీలు, కూలర్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఇవేవి అందుబాటులో లేని వారు మాత్రం ఫ్యాన్లతో కాలం వెల్లదీస్తున్నారు. అయితే ఆలోచన ఉండాలే కానీ ఫ్యాన్‌ను కూడా ఏసీలాగా మార్చేయవచ్చని నిరూపించాడో యువకుడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో.. టేబుల్ ఫ్యాన్‌ను తీసుకుని దాని వెనుక భాగాన్ని ఓపెన్ చేశాడు. కట్ చేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను దానికి జాయిన్ చేసి, మరోవైపు నుంచి ఓ ప్లాస్టిక్ పైపు కనెక్ట్ చేశాడు. ఆపై ఓ బాక్సులో ఐస్ ముక్కలు వేసి, ఆ బాక్స్‌కు కూడా పైపు జాయిన్ చేశాడు. చివరికి టేబుల్ ఫ్యాన్ ఆన్ చేయగానే.. ఆ బాక్స్‌లోని చల్లదనం ఫ్యాన్‌ ద్వారా బయటకి వచ్చింది.

చూడ్డానికి ఫన్నీగా ఉన్నా గాలి మాత్రం చల్లగా రావడం ఖాయం. ఫ్యాన్‌ రెక్కల వెనకాల ఉన్న గాలిని లాగి మనకు కావాల్సిన గాలిని అందిస్తుంది. ఐస్‌ క్యూబ్స్‌ ఎలాగో చల్లగా ఉంటాయి కాబట్టి ఫ్యాన్‌ గాలి సహజంగానే ఏసీని తలపిస్తుంది. దీనతంటినీ వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది.

వీడియో చూసిన వారు యువకుడి ట్యాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. ఐడియా మాములుగా లేదంట పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఐడియా కచ్చితంగా వర్కవుట్‌ అవుతుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద తక్కువ ఖర్చులో చల్లటి గాలి పొందే ఈ టెక్నిక్‌ చూడ్డానికి భలే ఉంది.




Show Full Article
Print Article
Next Story
More Stories