Viral Video: తననే తాను మింగుకుంటూ ఆత్మహత్యకు ప్రయత్నించిన పాము.. కాపాడిన వ్యక్తి

Viral Video: తననే తాను మింగుకుంటూ ఆత్మహత్యకు ప్రయత్నించిన పాము.. కాపాడిన వ్యక్తి
x

Viral Video: తననే తాను మింగుకుంటూ ఆత్మహత్యకు ప్రయత్నించిన పాము.. కాపాడిన వ్యక్తి

Highlights

తన శరీరాన్ని తానే మింగుకుంటూ ఆత్మహత్యకు ప్రయత్నించిన పామును ఓ వ్యక్తి కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా మనుషుల ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. కానీ, ఒక పాము తననే తాను మింగుకుంటూ ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ పాము తన శరీరాన్ని తానే మింగడం ప్రారంభించిన దృశ్యం కనిపిస్తోంది. ఇప్పటికే అది తన శరీరంలో సగభాగాన్ని లోపలికి తీసుకుంది. ఈ సమయంలో పక్కనే ఉన్న ఓ వ్యక్తి పరిస్థితిని గమనించి వెంటనే స్పందించాడు. అతడు జోక్యం చేసుకోవడంతో పాము తన తోక భాగాన్ని బయటకు వదిలేసి ప్రమాదం నుంచి బయటపడింది.

ఈ పామును "స్పెకుల్డ్ కింగ్ స్నేక్ (Speckled King Snake)"గా గుర్తించారు. ఇది విషపూరితం కాని పాము కావడంతో మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ జాతి పాములు ఎలుకలు, బల్లులు, కొన్నిసార్లు ఇతర పాములను కూడా ఆహారంగా తీసుకుంటాయి.

ఈ వీడియోను ‘Crazy Clips’ అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. 39 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటికే వేలాది మంది వీక్షించగా, వందల సంఖ్యలో లైక్స్, షేర్లు వచ్చాయి. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు “జంతువులను కాపాడితేనే ప్రపంచం బాగుంటుంది” అంటూ వ్యాఖ్యానించారు.

మరికొందరు ఈ సంఘటనను ప్రాచీన చిహ్నమైన "ఔరోబోరస్ (Ouroboros)"తో పోల్చారు. ఔరోబోరస్‌లో పాము తన తోకను తానే తింటూ ఉండటం జీవిత చక్రానికి ప్రతీకగా భావిస్తారు. ఈ వీడియోలోనూ అలాంటి దృశ్యమే కనిపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories