Viral video: సింహం తినే మూడ్‌లో ఉంది.. లేదంటేనా… నీ రీల్స్ పిచ్చికి అదే చివరి రోజు అయ్యేది!

Viral video: సింహం తినే మూడ్‌లో ఉంది.. లేదంటేనా… నీ రీల్స్ పిచ్చికి అదే చివరి రోజు అయ్యేది!
x

Viral video: సింహం తినే మూడ్‌లో ఉంది.. లేదంటేనా… నీ రీల్స్ పిచ్చికి అదే చివరి రోజు అయ్యేది!

Highlights

కొంతమంది రీల్స్‌కు బానిసలై ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాములు, పులులు, సింహాలతో సెల్ఫీలు దిగే ప్రయత్నంలో కన్నవారికి తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు.

కొంతమంది రీల్స్‌కు బానిసలై ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాములు, పులులు, సింహాలతో సెల్ఫీలు దిగే ప్రయత్నంలో కన్నవారికి తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ జిల్లాలోని బాంబోర్ గ్రామం నుంచి ఒక షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది.

వీడియోలో ఒక యువకుడు గిర్ నేషనల్ పార్క్ సమీపంలో సింహం దగ్గరకు వెళ్లి వీడియో తీయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ సింహం ఎరను తింటూ ఉండగా, యువకుడు మొబైల్ చేత పట్టుకొని దగ్గరకు వెళ్ళాడు. సింహం అతన్ని గమనించి ఎరను వదిలేసి ఒక్కసారిగా కోపంతో గర్జించింది. అనంతరం అతని వైపు వేగంగా పరిగెత్తింది.

ఈ దృశ్యం చూసిన యువకుడు భయంతో వెనక్కి తిరిగి పరుగెత్తాడు. దూరం నుండి కొందరు వ్యక్తులు అరుస్తూ సింహం దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తూ ఆ యువకుడి ప్రాణాలు తప్పాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు యువకుడి నిర్లక్ష్యపు చర్యపై తీవ్రంగా మండిపడుతున్నారు. "ఇది మూర్ఖత్వం", "ఇలాంటి వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి" అంటూ కామెంట్లు పెడుతున్నారు. రీల్స్ కోసం ఇలా ప్రాణాలపై వేసే దెబ్బలు అసలు సమాజానికి తప్పుదారి చూపేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories