Viral Video: అగ్నిపర్వతం మధ్యలో ప్రేమ ప్రపోజ్‌ – నెటిజన్ల ఫన్నీ కామెంట్స్‌తో హాట్ టాపిక్

Viral Video: అగ్నిపర్వతం మధ్యలో ప్రేమ ప్రపోజ్‌ – నెటిజన్ల ఫన్నీ కామెంట్స్‌తో హాట్ టాపిక్
x

Viral Video: అగ్నిపర్వతం మధ్యలో ప్రేమ ప్రపోజ్‌ – నెటిజన్ల ఫన్నీ కామెంట్స్‌తో హాట్ టాపిక్

Highlights

ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరచడానికి వినూత్నమైన మార్గాలను ఎంచుకుంటుంటారు. కొందరు పార్కులు, కొందరు దేవాలయాలు, మరికొందరు హిల్‌ స్టేషన్లలో తమ భావాలను వ్యక్తపరుస్తారు. తాజాగా ఒక జంట చేసిన ప్రేమ ప్రపోజ్ మాత్రం అందరినీ షాక్‌లోకి నెట్టింది.

అగ్నిపర్వతం విస్ఫోటనం జరుగుతుండగా ఓ యువకుడు తన ప్రియురాలికి ప్రపోజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పర్వత శిఖరంపై ఫోటోలకు పోజులిస్తున్న జంటలో, అకస్మాత్తుగా యువకుడు మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. ఆశ్చర్యంతో సిగ్గుపడిన యువతి వెంటనే “అవును” అంటూ స్పందించింది. అదే సమయంలో వారి వెనుక అగ్నిపర్వతం గట్టిగా విస్ఫోటనం చెందడంతో ఆ క్షణం మరపురానిదిగా మారింది.

స్నేహితులు కెమెరాలో బంధించిన ఆ సన్నివేశం ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ షేర్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.

“స్వర్గం ఎర్ర జెండా చూపిస్తోంది” అని ఒకరు రాయగా,

“ఆమె ప్రపోజ్ కంటే విస్ఫోటనంపై ఎక్కువ ఎక్సైటెడ్‌గా ఉంది” అని మరొకరు సరదాగా స్పందించారు.

ఇంకొకరు “ఇది భవిష్యత్తులో వారి పెళ్లి మంటల్లోనే జరుగుతుందన్న సంకేతమా?” అని కామెంట్ చేశారు.

“ఆ విస్ఫోటనం టైమింగ్ పర్ఫెక్ట్! ప్రకృతి వారితో కలిసి సంబరపడుతోంది” అని మరో యూజర్ రాశారు.

ప్రేమికుల ప్రత్యేక క్షణం – అగ్నిపర్వతం సాక్షిగా – ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories