Viral Video: "అక్కడెలా పెట్టావ్ బ్రో!" ఇంటి కాంపౌండ్‌ గోడపైకి కారు ఎక్కించిన డ్రైవర్, వీడియో వైరల్

Viral Video: అక్కడెలా పెట్టావ్ బ్రో! ఇంటి కాంపౌండ్‌ గోడపైకి కారు ఎక్కించిన డ్రైవర్, వీడియో వైరల్
x

Viral Video: "అక్కడెలా పెట్టావ్ బ్రో!" ఇంటి కాంపౌండ్‌ గోడపైకి కారు ఎక్కించిన డ్రైవర్, వీడియో వైరల్

Highlights

జులాయి సినిమాలోని "అక్కడెలా పెట్టావ్" డైలాగ్ గుర్తుందా? అదే సీన్ నిజజీవితంలో జరిగిందంటే నమ్మగలరా! నిద్రమత్తులో ఒక డ్రైవర్‌ తన కారును ఏకంగా ఒక ఇంటి కాంపౌండ్‌ గోడపైకి ఎక్కించేశాడు. ఈ విచిత్ర ఘటన హైదరాబాద్‌ శివారులోని దుండిగల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.

ఏం జరిగింది?

మేడ్చల్ జిల్లాకు చెందిన శంభీపూర్‌ నివాసి రాత్రి సమయంలో కారును డ్రైవ్ చేస్తూ నిద్రమత్తులో ఉండగా నియంత్రణ కోల్పోయి, రోడ్డుపక్కనే ఉన్న ఒక ఇంటి కాంపౌండ్‌ వాల్‌పైకి ఎక్కించాడు. కారు గోడ చివరికి వెళ్లి ఆగిపోయింది. పెద్ద శబ్ధం విని నిద్రలేచిన ఇంటి యజమానులు గోడపై కారును చూసి షాక్‌ అయ్యారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి, ఉదయం క్రేన్ సహాయంతో కారును గోడపై నుంచి కిందకు దించారు.

వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఈ విచిత్ర సంఘటనను స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగానే వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు తమ తమ శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

"అక్కడెలా పెట్టావ్ బ్రో!" అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా,

"మరో పెగ్ వేస్తే కారును ఎలా పెట్టాడో అలానే కిందకు దించేవాడు" అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories