Viral Video: చెరువులో రంగు రంగుల చేప.. పట్టుకుందామని చూడగా ఒక్కసారిగా షాక్‌

Viral Video
x

Viral Video: చెరువులో రంగు రంగుల చేప.. పట్టుకుందామని చూడగా ఒక్కసారిగా షాక్‌

Highlights

Viral Video: సోషల్‌ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వీటిలో కొన్ని విజ్ఞానాన్ని పెంచేవి ఉంటే మరికొన్ని ఫన్నీ వీడియోలు ఉన్నాయి.

Viral Video: సోషల్‌ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వీటిలో కొన్ని విజ్ఞానాన్ని పెంచేవి ఉంటే మరికొన్ని ఫన్నీ వీడియోలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫన్నీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇంతకీ అంతలా ఆ వీడియోలో ఏముంది.? అసలు కథ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

చెరువులో తిరుగుతోన్న చేపలను చూస్తుంటే భలే అనిపిస్తాయి. అందులోనూ రంగురంగుల చేపలను చూస్తే ఎగ్జైట్‌ కావడం ఖాయం. ఓ యువకుడికి చెరువులో అలాంటి చేపనే కనిపించింది. దీంతో ఎలాగైనా సరే ఆ చేపను పట్టుకోవాలని ఫిక్స్‌ అయ్యాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తిని దానిని వీడియో తీయమని కోరాడు. చేప కదలకుండా ఉండే ఉద్దేశంతో నెమ్మదిగా చప్పుడు చేయకుండా చేతిని చేప వరకు తీసుకెళ్లాడు.

ఒక్కసారిగా అమాంతం ఆ చేపు చేత్తో పట్టేసుకున్నాడు. ఎంచక్కా వెరైటీ చేప దొరికిందని సంబరపడ్డాడు. అయితే అంతలోనే చేయి తెరిచి చూడగా అసలు విషయం తెలిసింది. అసలు విషయం ఏంటంటే ఆ చేపలో ఉంది అసలు చేపనే కాదు. ప్లాస్టిక్‌ పేపర్‌లో ఉన్న ఓ చేప బొమ్మ. దీంతో ఆగ్రహంతో ఆ పేపర్‌ను నీటిలోకి విసిరేశాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది.

కంటికి కనిపించేది అంతా నిజం కాదని చెప్పేందుకు బెస్ట్‌ ఉదాహరణగా నిలుస్తోందీ వీడియో. ఇక ఈ వీడియోను ఇప్పటి వరకు సుమారు 3.58 లక్షల మంది చూడగా ఏకంగా 10 వేల వరకు లైక్‌లు వచ్చాయి. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏదో అనుకుంటో ఇంకోదో జరిగిందని పాట పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories