Viral Video: స్టంట్ రీల్‌ కోసం ఫ్లైఓవర్‌ ఎక్కాడు.. హీరో అవుదామని జంప్‌ కొట్టాడు.. చివరికి జీరో అయ్యాడు!

Viral Video: స్టంట్ రీల్‌ కోసం ఫ్లైఓవర్‌ ఎక్కాడు.. హీరో అవుదామని జంప్‌ కొట్టాడు.. చివరికి జీరో అయ్యాడు!
x

Viral Video: స్టంట్ రీల్‌ కోసం ఫ్లైఓవర్‌ ఎక్కాడు.. హీరో అవుదామని జంప్‌ కొట్టాడు.. చివరికి జీరో అయ్యాడు!

Highlights

ప్రస్తుతం సోషల్‌ మీడియా యుగం నడుస్తోంది. కాస్త ఫేమస్ కావాలనే ఉద్దేశంతో చాలా మంది రకరకాల రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఒక స్టంట్ రీల్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం సోషల్‌ మీడియా యుగం నడుస్తోంది. కాస్త ఫేమస్ కావాలనే ఉద్దేశంతో చాలా మంది రకరకాల రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఒక స్టంట్ రీల్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక వ్యక్తి ఫ్లైఓవర్‌ గోడమీద నిలబడి ఉన్నాడు. అప్పట్లో రోడ్డుపై ఒక వ్యాన్ వెళుతుండగా, సినిమాలో హీరోల మాదిరిగా దానిపై దూకాలని ప్రయత్నించాడు. కానీ లెక్క తప్పి నేరుగా కిందపడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలైనట్లు వీడియోలో కనిపిస్తోంది.

సినిమాల్లో కనిపించేలా వాహనంపై సేఫ్‌గా దూకుతానని ఆ వ్యక్తి అనుకున్నా.. వాస్తవంలో అతని అంచనా తప్పిపోయింది. ఫ్లైఓవర్‌ పై నుంచి నేరుగా నేలపై పడ్డాడు. అతని వెన్నుపై, శరీరంపై బలమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ఈ వ్యక్తి చెత్త ట్రక్కుపై దూకాలని రీల్‌ ప్లాన్ చేసుకున్నాడు. కానీ టైమింగ్‌ తప్పిపోవడంతో నేరుగా కింద పడిపోయాడు. దీంతో అతని రీల్‌ డ్రీమ్‌ అక్కడికక్కడే జీరో అయిపోయింది.

ఇప్పటికే ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. కొందరు నెటిజన్లు "ఇలాంటివి చేస్తే ఇలాగే శిక్ష పడుతుంది" అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు "ఇప్పుడైనా స్టంట్స్‌ మానేస్తాడు" అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories