Viral Video: ఇది ఆటోనా? పుష్కక విమానం అనుకుంటివా భయ్యా? ఇంత మంది ఎలా ఎక్కార్రా బాబు?

Viral Video
x

Viral Video: ఇది ఆటోనా? పుష్కక విమానం అనుకుంటివా భయ్యా? ఇంత మంది ఎలా ఎక్కార్రా బాబు?

Highlights

UP Student At Risk Viral Video: సాధారణంగా ఆటోలో ముగ్గురు కూర్చోవాలి అంటారు. లేకపోతే ఒక్క ఫ్యామిలీ ఇద్దరు పెద్దలు ఇద్దరు పిల్లలకు సరిపోతుంది. కానీ, ఉత్తరప్రదేశ్‌లో ఓ త్రీవీలర్‌ ఆటో డ్రైవర్‌ ఎంతమంది పిల్లలను ఎక్కించుకుని ఆటో నడుపుతున్నాడో తెలుసా?

UP Student At Risk Viral Video: ఆటోలో పిల్లల ప్రాణాలు ఏమాత్రం లెక్క చేయకుండా వారిని స్కూలు తీసుకెళ్తున్నాడు ఓ ఆటోవాలా. ఇది గమనించిన పోలీసులు ఆటోను ఆపి ఒక్కక్కరినీ బయటకు రప్పించి ఆశ్చర్యపోయారు. వారు ఒక్కక్కరుగా బయటకు వస్తూనే ఉన్నారు. యూపి ఝాన్సీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్‌ అవుతుంది. చూసిన నెటిజెన్లు కూడా ఇది ఆటోనా? లేదా పుష్కక విమానం అనుకుంటివా? భయ్యా అని కామెంట్లు కూడా పెడుతున్నారు.

ఈ వీడియోలో త్రీ వీలర్‌ ఆటోలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది స్కూలు పిల్లలు ఉన్నారు. వారంతా స్కూలు యూనిఫామ్‌ ధరించారు. ఓ పోలీసు చెకింగ్‌లో ఉన్న సమయంలో ఆ ఆటో కంట పడింది. దీంతో వెంటనే ఆటో డ్రైవర్‌ను ఆపి ఒక్కో స్టూడెంట్‌ను బయటకు తీసుకువచ్చారు. ఈ వీడియోలో పోలీసు ఒక్కో పిల్లవాడిని లెక్కపెడుతూ ఉన్నాడు. చివరగా 14 నెంబర్‌ వద్ద ఆగింది. ఈ వీడియోలో మొత్తం ఆటో వెనుక వైపు 11 మంది విద్యార్థులు కూర్చున్నారు. ముందు ముగ్గురు కూర్చున్నారు. డబ్బుల కోసం పిల్లల ప్రాణాలు ఫణంగా పెట్టి ఇలాంటి డేంజరస్‌ డ్రైవింగ్‌ చేయడం చాలా ప్రమాదం. దీంతో సదరు పోలీసు ఆటో డ్రైవర్‌కు చలానా కూడా వేశాడు.

గతంలో కూడా ఝాన్సీలో ఇలానే ప్రమాదకరంగా ఒక చిన్న ఆటోలో ఎక్కువ మంది ప్రయాణీకులను కుక్కి డ్రైవింగ్‌ చేశాడు. ఆ సమయంలో ఆటోలో మొత్తం 19 మంది ఉన్నారు. అయితే, ఇద్దరు ప్రయాణీకులు ఏకంగా ఆటో రూఫ్‌పై కూర్చున్నారు. ఎందుకంటే ఆటోలో కూర్చునేందుకు కాదు కనీసం కాళు దూర్చే సందు కూడా లేదు కాబట్టి. నెట్టింటా ఆ వీడియో బాగా వైరల్‌ అయింది. ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించి ఇలాంటి డేంజరస్‌ డ్రైవింగ్‌తో ప్రయాణీకులు, చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

2022 నివేదికల ప్రకారం ఇలా ఎక్కువ మందితో పరిమితికి మించి ప్రయాణించడంతో 6.1 శాతం ప్రమాదాలు జరిగాయి. ఇందులో 7.1 శాతం మంది ప్రాణాలు కోల్పోగా, 6.4 శాతం మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు.



Show Full Article
Print Article
Next Story
More Stories