Viral Video: ఈ వీడియో చూస్తే.. ఇకపై జీవితంలో గోర్లు కొరకరు..

If you see this video you will never bite your nails, Viral video
x

Viral Video: ఈ వీడియో చూస్తే.. ఇకపై జీవితంలో గోర్లు కొరకరు.. 

Highlights

Viral Video: ఈ వీడియో చూస్తే.. ఇకపై జీవితంలో గోర్లు కొరకరు..

Viral Video: గోర్లు కొరకడం చాలా మందికి ఉండే సర్వసాధారణమైన అలవాటు. టెన్షన్‌గా ఉన్నప్పుడో, ఏదైనా ఆలోచిస్తున్న సమయంలోనో కచ్చితంగా గోర్లు కొరుకుతుంటారు. అయితే గోర్లు కొరకడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా చాలా మంది ఈ అలవాటును అంత సులభంగా మానుకోరు. మరీ ముఖ్యంగా చిన్నారులు నిత్యం గోర్లను నోట్లోనే పెట్టుకుంటారు.

దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అందుకే గోర్లను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతుంటారు. ఇక చిన్న తనం నుంచే గోర్లు కొరకకూడదంటూ పాఠ్యాంశాల్లో సైతం వివరిస్తుంటారు. అయితే గోర్లు కొరకడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో ఇప్పటి వరకు థియరీలాగే చెప్పి ఉంటారు. కానీ తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ప్రాక్టికల్‌గా చెబుతోంది. ఈ వీడియోను చూస్తే మీరు మళ్లీ జీవితంలో గోర్లు కొరకాలంటే జడుసుకోవడం ఖాయం. ఇంతకీ ఆ వీడియోలో అంతలా ఏముందనేగా..

గోర్లు కొరకడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో తెలియజేయడానికి ఈ వీడియోను రూపొందించారు. ఇందులో భాగంగా ముందుగా గోర్ల మధ్యలో ఉండే మట్టిని సేకరించారు. అనంతరం దాంట్లో కొంత కెమికల్‌ లిక్విడ్‌ను కలిపి మైక్రోస్కోప్‌ కింద పెట్టి పరిశీలించారు. ఆ సమయంలో గోర్ల నుంచి సేకరించిన ఆ దుమ్ములో కొన్ని వేల క్రిములు ఉన్నాయి. అంతేనా అవి ప్రాణంతో అటుఇటు కదలడం కూడా గమనించవచ్చు. ఒకవేళ గోర్లను నోట్లో పెట్టుకొని కొరికితే ఎంచక్కా ఆ క్రిములన్నీ కడుపులోకి వెళ్లిపోతాయి, వెళ్లిన క్రిములు వెళ్లినట్లు ఉంటాయా.? ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే గోర్లను కొరకకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది. గోర్లు కొరికే అలవాటు ఉన్న వారికి ఈ వీడియో చూపిస్తే చచ్చినట్లు ఆ అలవాటును మానేస్తారు కదూ!


Show Full Article
Print Article
Next Story
More Stories