Viral Video: భారీ వర్షాలకు నదులుగా మారిన రాజస్థాన్ వీధులు.. వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోలు వైరల్

Viral Video
x

Viral Video: భారీ వర్షాలకు నదులుగా మారిన రాజస్థాన్ వీధులు.. వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోలు వైరల్

Highlights

Viral Video: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రాలు అల్లకల్లోలం అవుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, కర్నాటక, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల్లో గత కన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

Viral Video: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రాలు అల్లకల్లోలం అవుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, కర్నాటక, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల్లో గత కన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వీధులు నదులుగా మారాయి. వాహనాలన్నీ ఆ నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా రాజస్థాన్ వరుస వర్షాలతో అతలాకుతలమైపోయింది. భారీ వర్షాలతో అజ్మీర్, కోటా, పాలి, జాలోర్, ధోల్పూర్ జిల్లాలు వరద నీటిలో మునిగిపోయాయి. రోడ్లు, నివాసాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల గోడలు కూలిపోయాయి. రోడ్లపైన వరద నీరు చేరిపోవడంతో వాహానాలన్నీ నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. చంబల్ నది పరివాహక ప్రాంతాల్లో అధిక వర్షపాతంతో నది పొంగి పొర్లుతోంది. ముఖ్యంగా అజ్మీర్‌‌లో రోడ్డు అసలు కనిపించడం లేదు. అవన్నీ ఇప్పుడు నదులుగా మారిపోయాయి. వీధుల వెంట వరదలు పోటెత్తాయి. కొంతమంది ప్రజలు, బైక్‌లతో పాటు కొట్టుకుపోయారు. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉత్తర ప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో గంగానది ఉదృతంగా ప్రవహిస్తోంది. వారణాసి, ప్రయాగ్ రాజ్ లోని కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.



Show Full Article
Print Article
Next Story
More Stories