Viral Video: కొండచిలువ చెట్టు ఎక్కే అద్భుతమైన విధానం – వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్!

Viral Video: కొండచిలువ చెట్టు ఎక్కే అద్భుతమైన విధానం – వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్!
x

Viral Video: కొండచిలువ చెట్టు ఎక్కే అద్భుతమైన విధానం – వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్!

Highlights

సోషల్ మీడియా యుగంలో ప్రతి రోజు ఎన్నో వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పాములు, అడవి జంతువుల వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి.

సోషల్ మీడియా యుగంలో ప్రతి రోజు ఎన్నో వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పాములు, అడవి జంతువుల వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. చెట్టెక్కుతున్న ఓ కొండచిలువ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

భారీ పరిమాణం, బలమైన కండరాలతో ప్రసిద్ధి పొందిన కొండచిలువలు పెద్ద జంతువులను కూడా సులభంగా వేటాడగలవు. సాధారణంగా ఇవి వేటాడిన జంతువును జీర్ణం చేసుకునే సమయంలో చెట్టుకు చుట్టుకుని విశ్రాంతి తీసుకుంటాయని చెబుతారు. కానీ ఈసారి కొండచిలువ ఎవ్వరినీ వేటాడలేదు; కేవలం చెట్టెక్కుతున్న తీరు మాత్రం ఆశ్చర్యపరిచింది.

ఈ వీడియోలో పాము చెట్టును చుట్టుకుంటూ, బలమైన కండరాలను ఉపయోగించి ఎలా పైకి ఎక్కుతుందో స్పష్టంగా కనిపిస్తోంది. కన్సర్టినా స్టైల్ కదలికలతో చెట్టును బిగిగా పట్టుకుని, ఒక్కోసారి తన శరీరాన్ని పైకి నెట్టుకుంటూ ఎక్కుతుంది. బలమైన కండరాలు, పొలుసుల కారణంగా నిలువుగా ఉన్న ఉపరితలాలపై కూడా సులభంగా ఎక్కగలగడం దీని ప్రత్యేకత.

చూడటానికి కొంచెం భయంకరంగా ఉన్నా, చెట్టెక్కుతున్న ఈ కొండచిలువ తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories