Viral Video: జాతీయ గీతాన్ని చిట్టితల్లి ఎంత ముద్దుగా పాడిందో… వీడియో చూసి మీరు కూడా ఫిదా అవ్వక మానరు

Viral Video: జాతీయ గీతాన్ని చిట్టితల్లి ఎంత ముద్దుగా పాడిందో… వీడియో చూసి మీరు కూడా ఫిదా అవ్వక మానరు
x

Viral Video: జాతీయ గీతాన్ని చిట్టితల్లి ఎంత ముద్దుగా పాడిందో… వీడియో చూసి మీరు కూడా ఫిదా అవ్వక మానరు

Highlights

ప్రస్తుతం సోషల్ మీడియా లో నెటిజన్స్ హృదయాలను హత్తుకుంటున్న ఓ ముద్దైన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ చిన్నారి భారత జాతీయ గీతం “జన గణ మన”ను అమితమైన మాధుర్యంతో పాడుతూ కనిపిస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియా లో నెటిజన్స్ హృదయాలను హత్తుకుంటున్న ఓ ముద్దైన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ చిన్నారి భారత జాతీయ గీతం “జన గణ మన”ను అమితమైన మాధుర్యంతో పాడుతూ కనిపిస్తోంది. ఆ చిన్నారి అమాయకమైన శైలి, మధురమైన స్వరం చూసి వినేవాళ్లందరూ మంత్రముగ్ధులవుతున్నారు. వీడియో అప్‌లోడ్‌ చేసిన వెంటనే వేగంగా పాపులర్‌ అయి, నెటిజన్స్ ఒకరికి ఒకరు షేర్‌ చేసుకుంటూ ట్రెండ్‌లోకి తెచ్చేశారు.

ఈ వీడియోలో చిన్నారి గాత్రంలో వినిపించే అమాయకత్వం, స్వచ్చమైన దేశభక్తి ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకుంటుంది. పాట పాడే సమయంలో ఆమె ముఖంలో ప్రతిబింబించిన గర్వం, దేశం పట్ల చూపించిన గౌరవం అందరినీ కట్టిపడేస్తాయి. ఈ క్లిప్‌ ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక భావోద్వేగ క్షణాల్లో ఒకటిగా నిలిచింది.

కళ్ళు మూసుకుని, పూర్తి ఏకాగ్రతతో ‘జన గణ మన’ పాడుతున్న ఆ చిన్నారి దృశ్యం ప్రాంతీయ గుర్తింపుతో పాటు భారతీయ సంస్కృతి, ఐక్యత, గర్వం, వైవిధ్యాల్ని మరింత హైలైట్ చేస్తుంది. ఈ వీడియోను రోయింగ్ ఎమ్మెల్యే ముచ్చు మిథి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇంటర్నెట్‌లో నేను చూసిన అతి అందమైన వీడియో ఇదే” అని ఒకరు రాశారు. “ఈ చిన్నారి భవిష్యత్తులో కూడా దేశభక్తితో మెరుస్తుంది” అని మరొకరు పోస్టు చేశారు. “చిన్న దేవదూత, జై హింద్! దేవుడు నీకు మంచి ఆరోగ్యం, ఆనందం ప్రసాదించుగాక” అని ఇంకొకరు కామెంట్ పెట్టారు.



Show Full Article
Print Article
Next Story
More Stories