Viral Video: ఫ్యుచర్‌లో ఈ చిన్నారి స్టార్‌ క్రికెట్ కావడం ఖాయం.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Viral Video 6 Year-Old Girl from Pakistan Plays Cricket Like a Pro
x

Viral Video: ఫ్యుచర్‌లో ఈ చిన్నారి స్టార్‌ క్రికెట్ కావడం ఖాయం.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Highlights

Viral Video: ఒకప్పుడు మనలోని ట్యాలెంట్‌ ప్రపంచానికి తెలియాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. సరైన వేదికలు లేకపోవడంతో ఇబ్బందులు పడేవారు.

Viral Video: ఒకప్పుడు మనలోని ట్యాలెంట్‌ ప్రపంచానికి తెలియాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. సరైన వేదికలు లేకపోవడంతో ఇబ్బందులు పడేవారు. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. ఎప్పుడైతే సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిందో. ప్రపంచంలో ఏ మూలన ఎలాంటి ప్రతిభ ఉన్నా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతుంది. దీంతో అనుకోని అవకాశాలు కూడా వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన ఆరేళ్ల సోనియా ఖాన్‌ అనే చిన్నారి ఇంటి ముందు సరదాగా క్రికెట్‌ అడుతోంది. తండ్రి బాల్స్‌ వేస్తుంటే చక్కగా వాటిని బాదుతోంది. అయితే ఏదో కొట్టాం అంటే కొట్టాం అన్నట్లు కాకుండా చాలా చక్కగా ప్రొఫెషనల్‌ క్రికెటర్‌లాగా బంతులను బాదడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లాంగ్‌ షార్ట్‌, స్ట్రెయిల్‌ డ్రైవ్‌, హాఫ్‌ డ్రైవ్‌ ఇలా అన్ని దిశల్లో బంతులను ఓ రేంజ్‌లో బాదేస్తోంది.

ఒక రకంగా చెప్పాలంటే ఆ చిన్నారి బ్యాట్‌ పట్టుకున్న విధానం, షార్ట్స్‌ కొడుతున్న పద్ధతి చూస్తుంటే.. భారత కెప్టెన్ రోహిత్ శర్మను తలపిస్తుంది. దీనంతటినీ వీడియోగా తీసిన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. సోనియా ట్యాలెంట్‌ చూసిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లిష్ క్రికెట్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఈ వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేయగా తెగ వైరల్‌ అవుతోంది. ఆరేళ్ల వయసులోనే పూర్తి ప్రొఫెషనల్ క్రికెటర్‌గా షాట్‌లు కొట్టడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ చిన్నారి.. పాకిస్థాన్‌ ఫ్యూచర్‌ స్టార్‌ క్రికెటర్‌ కావడం ఖాయం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories