Viral News: వామ్మో ఇదేం భయంకరమ్రా బాబు.. మహిళ తింటున్న కర్రీపఫ్‌లో పాము! తర్వాత ఏం జరిగిందంటే…

Viral News: వామ్మో ఇదేం భయంకరమ్రా బాబు.. మహిళ తింటున్న కర్రీపఫ్‌లో పాము! తర్వాత ఏం జరిగిందంటే…
x

Viral News: వామ్మో ఇదేం భయంకరమ్రా బాబు.. మహిళ తింటున్న కర్రీపఫ్‌లో పాము! తర్వాత ఏం జరిగిందంటే…

Highlights

మహబూబ్‌నగర్‌ జిల్లాలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. జడ్చర్లలోని ఒక బేకరీలో కర్రీపఫ్‌ తినేందుకు వచ్చిన మహిళకు భయంకర అనుభవం ఎదురైంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. జడ్చర్లలోని ఒక బేకరీలో కర్రీపఫ్‌ తినేందుకు వచ్చిన మహిళకు భయంకర అనుభవం ఎదురైంది. ఆమె తింటున్న కర్రీపఫ్‌లో పాము కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే బేకరీ యజమానిని నిలదీసి, ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళ్తే…

జడ్చర్లలోని ఒక బేకరీకి వచ్చిన మహిళ కర్రీపఫ్‌ ఆర్డర్‌ చేసింది. వెయిటర్‌ తీసుకొచ్చి ఇవ్వడంతో తినడం ప్రారంభించింది. అయితే రుచిలో ఏదో తేడాగా అనిపించడంతో పఫ్‌ను ఓపెన్‌ చేసింది. అందులో పాము కనిపించడంతో ఆమె భయంతో కంగుతింది.

ఆమె వెంటనే బేకరీ నిర్వాహకులను ప్రశ్నించగా, అక్కడే చిన్నపాటి హంగామా జరిగింది. అనంతరం మహిళ స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర చర్చకు దారితీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories