Viral News: ఆహారాన్ని వృథా చేస్తే రూ.20 ఫైన్‌ తప్పనిసరి!

Viral News: ఆహారాన్ని వృథా చేస్తే రూ.20 ఫైన్‌ తప్పనిసరి!
x

Viral News: ఆహారాన్ని వృథా చేస్తే రూ.20 ఫైన్‌ తప్పనిసరి!

Highlights

ఆహార వృథాను అరికట్టేందుకు పుణెలోని ఓ రెస్టారంట్‌ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఆహారాన్ని వృథా చేస్తే రూ.20 అదనంగా చెల్లించాల్సిందేనని కొత్త నిబంధన అమలు చేసింది. దీనికి సంబంధించిన మెనూ బోర్డు ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ నెటిజన్‌ ఈ ఫోటోను ‘ఎక్స్‌’లో షేర్ చేస్తూ – “పుణెలోని ఓ హోటల్‌ వృథా ఆహారానికి రూ.20 ఫైన్‌ వసూలు చేస్తోంది. ప్రతి రెస్టారెంట్‌, పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఇలాంటివి అమలు చేస్తే ఆహార వృథా కొంతవరకైనా తగ్గిపోతుంది” అని వ్యాఖ్యానించారు.

ఇక నెటిజన్లు దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు – “ఇది మంచి ఆలోచన, వృథా తగ్గుతుంది” అని అంటుండగా, మరికొందరు – “నచ్చని ఆహారం బలవంతంగా ఎలా తినగలరు?” అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రెస్టారంట్‌ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories