Viral News: 8 ఏళ్ల పిల్లాడి కళ్లలో 35 పేను గుడ్లా?

Viral News
x

Viral News: 8 ఏళ్ల పిల్లాడి కళ్లలో 35 పేను గుడ్లా?

Highlights

Viral News: కళ్లకు ఒక చిన్న దెబ్డ తగిలినా తట్టుకోలేం. ఇక పిల్లల విషయానికొస్తే మరీ ఎక్కువ తల్లడిల్లిపోతుంటారు. సున్నితమైన కళ్లలో ఒక చిన్న నలక పడినా విలవిలలాడిపోతుంటారు. కానీ ఒక పిల్లాడి కనురెప్పలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 పురుగు గుడ్లు ఉండటాన్ని డాక్టర్లు గుర్తించాయి. వాటిని సక్సెస్ ఫుల్ గా బయటకు తీసి డాక్టర్లే షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

గుజరాత్‌లో అమ్రేలి జిల్లాలో ఉన్న సావర్కుండ్ల అనే ఊరిలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే హాస్పిటల్‌కి ఒక 8ఏళ్ల పిల్లాడిని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఇంతకీ పిల్లాడికి వచ్చిన బాధ ఏంటంటే.. చాలా రోజుల నుంచి తీవ్రమైన కంటి నొప్పితో బాధపడుతున్నాడు. కళ్లను బాగా నులుపుతున్నాడు. అప్పుడు అక్కడున్న డాక్టర్ పిల్లాడి కళ్లను పరీక్షించి షాకై పోయాడు. ఆ పిల్లాడి కళ్లలో పేను వంటి చిన్న చిన్న కీటకాలు గుడ్లు ఆ పిల్లాడి కనురెప్పల్లో కనిపించాయి. అంటే అవి అక్కడకు వెళ్లి గుడ్లుపెట్టాయి. ఇది ఎలా సాధ్యం అని ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

ఆపరేషన్ చేసి గుడ్లు తీసారు..

అతికష్టం మీద డాక్టర్లు పిల్లాడి కంటికి ఆపరేషన్ చేశారు. నెమ్మదిగా జాగ్రత్తగా పిల్లాడి కనురెప్పల్లో ఉన్న గుడ్లను బయటకు తీశారు. అయితే ఇక్కడ ఆపరేషన్ అంటే కోసి తీశారు అనుకునేరు అలా ఏం చేయకుండా కేవలం కంటికి సంబంధించిన డ్రాప్స్ వేసి వాటిని బయటకు తీశారు. అక్కడే గుడ్లే కాదు పురుగులు కూడా ఉండటాన్ని గుర్తించారు. కనురెప్పలోంచి 30 పురుగులు, 35 గుడ్లను బయటకు తీశారు. ఈ ఆపరేషన్‌ చేయడానికి డాక్టర్లకు దాదాపు ఒకటిన్నర గంటలపాటు సమయం పట్టింది. ఈ పురుగులను వెంటనే తొలగించాలి. లేకపోతే ఇవి రక్తాన్ని పీల్చేస్తాయి. ఇవి ఇలానే కంటిలోపల ఉండిపోతే నెమ్మది నెమ్మదిగా పిల్లలకు కంటిచూపు పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ పురుగులు పేనువంటివే కానీ పేన్లు కావని, ఇవొక పరాన్నజీవులని , స్నానం చేసేటప్పుడు కళ్లను కూడా కడుక్కోవడం ద్వారా ఇలాంటివాటికి దూరంగా ఉండొచ్చని డాక్టర్లు సలహా ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories