Viral: కింగ్ కోబ్రా చూపించి గుండె ఆగిపోయినంత పని..! స్నేక్ క్యాచర్‌ ధైర్యం చూసి ఆశ్చర్యపోతే తప్పదు!

Viral: కింగ్ కోబ్రా చూపించి గుండె ఆగిపోయినంత పని..! స్నేక్ క్యాచర్‌ ధైర్యం చూసి ఆశ్చర్యపోతే తప్పదు!
x

Viral: కింగ్ కోబ్రా చూపించి గుండె ఆగిపోయినంత పని..! స్నేక్ క్యాచర్‌ ధైర్యం చూసి ఆశ్చర్యపోతే తప్పదు!

Highlights

పాముల ప్రపంచంలో అత్యంత విషపూరితంగా, భయంకరంగా భావించే కింగ్ కోబ్రా (King Cobra) గురించి వినని వారు ఉండరు. ఈ జాతి పాము కాటు అంటే చాలు, మనిషి కొన్ని క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతాడు.

పాముల ప్రపంచంలో అత్యంత విషపూరితంగా, భయంకరంగా భావించే కింగ్ కోబ్రా (King Cobra) గురించి వినని వారు ఉండరు. ఈ జాతి పాము కాటు అంటే చాలు, మనిషి కొన్ని క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతాడు. అలాంటి ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఓ జనవాసానికి దగ్గరగా ప్రత్యక్షమైంది. స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు.

కింగ్ కోబ్రా ఓ ఇరుకైన సందులోకి వెళ్లిపోవడంతో, స్నేక్ క్యాచర్ నేరుగా దాని ఎదుటకే వెళ్లాల్సి వచ్చింది. అయితే, అతను ఎంతమాత్రం భయపడకుండా, తన వద్ద ఉన్న గోనె సంచి ముందుభాగానికి ఓ పైపు ముక్కను అటాచ్ చేసి పామును సమర్థవంతంగా ఆ దిశగా లాగే ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో కోబ్రా కొన్ని సార్లు విరుచుకుపడి దాడి చేసినా… అతను ధైర్యంగా వ్యవహరిస్తూ ఎట్టకేలకు పామును పట్టుకున్నాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చూస్తున్న వారిని భయంతో ఒళ్లు గగుర్పాటు చేయిస్తున్నాయి.

ఈ వీడియో చూసినవారంతా – “ఇంత పొడవైన, బలమైన పామును ఇలా పట్టు పడగలగడం సాధారణ విషయం కాదురా బాబోయ్!” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియోలో కనిపించిన కింగ్ కోబ్రా ‘నార్తర్న్ కింగ్ కోబ్రా’ జాతికి చెందినది. దీని శాస్త్రీయ నామం Ophiophagus hannah. ఇది ప్రధానంగా భారత్ నుంచి దక్షిణ చైనా వరకు విస్తరించిన ఆగ్నేయాసియా ప్రాంతాల్లో కనిపిస్తుంది. తెలుగులో దీనిని గిరినాగు అని పిలుస్తారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. పామును అద్భుతంగా, ఎంతో నైపుణ్యంతో కంట్రోల్ చేసిన ఆ స్నేక్ క్యాచర్‌ ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories