ఇలా చేశావేంటి భయ్యా! పెళ్లిరోజే భార్యకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఇచ్చిన వరుడు..

ఇలా చేశావేంటి భయ్యా! పెళ్లిరోజే భార్యకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఇచ్చిన వరుడు..
x

ఇలా చేశావేంటి భయ్యా! పెళ్లిరోజే భార్యకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఇచ్చిన వరుడు..

Highlights

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటనయూపీ రాష్ట్రం రాంపూర్‌లో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి జరిగిన మొదటి రోజే ఓ వరుడు తన కొత్త వధువుకు ప్రెగ్నెన్సీ...

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

యూపీ రాష్ట్రం రాంపూర్‌లో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి జరిగిన మొదటి రోజే ఓ వరుడు తన కొత్త వధువుకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఇచ్చి గర్భధారణ పరీక్ష చేయమని అడిగాడు. ఈ మాటలు విన్న వధువు షాక్‌కు గురై ఆగ్రహంతో వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది.

ఏం జరిగిందంటే?

జూలై 12న యూపీకి చెందిన ఓ యువకుడు, యువతితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొత్త జంట ఊరేగింపుగా ఇంటికి చేరుకుంది. అలసట, వేడి కారణంగా వధువుకు తల తిరుగుతున్నట్టు అనిపించిందని వరుడికి చెప్పింది.

అయితే వరుడు దీనిని గర్భధారణ సంకేతంగా పొరబడ్డాడు. తన స్నేహితులతో మాట్లాడగా వారు సరదాగా "ఇది గర్భధారణ కావచ్చు" అని చెప్పడంతో అతను మరింత భయపడ్డాడు. వెంటనే ఒక మెడికల్ షాప్‌కు వెళ్లి ప్రెగ్నెన్సీ కిట్ కొనుగోలు చేసి, వధువుకు ఇచ్చి పరీక్ష చేయమన్నాడు.

కుటుంబాల మధ్య గొడవ

వరుడు మాటలు విన్న వధువు ఆగ్రహంతో తల్లిదండ్రులను సంప్రదించింది. వెంటనే వధువు బంధువులు వరుడు ఇంటికి వచ్చి గొడవకు దిగారు. రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు స్థానికులు జోక్యం చేసుకొని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు.

వరుడు క్షమాపణ

సుమారు రెండు గంటలపాటు జరిగిన చర్చల తర్వాత వరుడు తన తప్పును బహిరంగంగా అంగీకరించాడు. వధువు మరియు ఆమె కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పి, ఇకపై ఇలాంటి తప్పు చేయనని హామీ ఇచ్చాడు. దీంతో వివాదం సద్దుమణిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories