Viral Video: ఎవర్రా మీరంతా..? 15 అడుగుల భారీ కొండ చిలువను.. 3కి.మీ ఎలా మోసారు?

Viral Video: ఎవర్రా మీరంతా..? 15 అడుగుల భారీ కొండ చిలువను.. 3కి.మీ ఎలా మోసారు?
x
Highlights

Viral Video: పాము అంటే ఎవరైనా భయపడతారు. ఇంక చిన్న పిల్లల సంగతైతే అసలే చెప్పనవసరం లేదు.

Viral Video: పాము అంటే ఎవరైనా భయపడతారు. ఇంక చిన్న పిల్లల సంగతైతే అసలే చెప్పనవసరం లేదు. పాము దూరంగా ఉన్నప్పుడే పారిపోతారు. అటువంటిది ఈ పిల్లలు 15 అడుగులు పొడవున్న ఒక భారీ కొండచిలువను 3 కిమీ వరకు చేతులతో మోసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అలసు ఈ కొండచిలువను ఈ పిల్లలు ఎందుకు మోయాల్సి వచ్చింది. అసలు దాని ఎక్కడకు మోసుకెళ్లారు.. పదండి ఆ వివరాల్లోకి వెళ్లిపోదాం..

ఉత్తర ప్రదేశ్‌లోని ఒక మారూ మూల ప్రాంతానికి చెందిన కొంతమంది పిల్లలు ఒక పెద్ద కొండచిలువును రోడ్డుపై మోసుకెళ్లారు. ఇంతకీ ఆ కొండ చిలువు బతికే ఉంది. ఒకరు తల పట్టుకుంటే మరొకరు తోక పట్టుకున్నారు. ఇంకొంతమంది పొట్ట దగ్గర పట్టుకున్నారు. ఏ భయమూ లేకుండా వారంతా చేతులతో ఈ కొండ చిలువను రోడ్డుపైన మోసుకెళ్లారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వీరంతా కొండ చిలువను మోసుకెళుతున్న సమయంలో మధ్య మధ్యలో వీడియోలు, సెల్ఫీలు కూడా తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని జహంగీర్ బాద్ కొత్వాలీ ప్రాంతంలో డూంగ్రా జాట్ అనే కుగ్రామం ఉంది. అయితే ఈ ఊరిలోకి ఉన్నట్టుండి ఒక పెద్ద కొండచిలువ వచ్చింది. ఆ కొండ చిలువ దాదాపుగా 15 అడుగులు పొడవు ఉంటుంది. నెమ్మదిగా పాకుండా ఊర్లోకి వచ్చిన వెంటనే ఆ ఊరిలో ఉన్న కొంతమంది పిల్లలు దాన్ని పట్టుకున్నారు. అది కూడా కదలకుండా ఉండిపోయింది. దీంతో పిల్లలంతా తల ఒకరు, తోక ఒకరు, పొట్ట దగ్గర ఒకరు అలా అందరూ ఆ పాముని జాగ్రత్తగా పట్టుకున్నారు. అలా రోడ్డుపైన దాన్ని పట్టుకుని, నడుచుకుంటూ మూడు కిమీ వరకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అరె.. ఎవర్రా వీరంతా? అంటూ, అది కొండ చిలువా లేక కొత్తిమీర కట్టా.. అంటూ నెటిజన్లు తెగ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

దాదాపు మూడు కిలోమీటర్ల పాటు ఈ కొండ చిలువను ఊరేగిస్తూ రోడ్డుపైన వెళ్లుతుంటే జనం అంతా వీళ్లనే చూశారు. మరికొంతమంది వచ్చి ఈ టీంలో చేరారు కూడా. ఈ కొండ చిలువను మోస్తున్నప్పుడు పిల్లలు ఎవరూ ఇబ్బంది పడలేదు. పైగా చాలా ఎంజాయ్ చేస్తూ దాన్ని మోసుకెళ్లారు. అలా మూడు కిలోమీటర్లు మోసుకెళ్లిన తర్వాత అడవిలో ఈ కొండచిలువను వదిలిసారు. వీళ్లు కొండచిలువను మోసుకెళుతున్న సమయంలో మధ్య మధ్యలో నవ్వుకుంటూ వీడియోలు తీసుకున్నారు. సెల్ఫీలు కూడా దిగారు.


Show Full Article
Print Article
Next Story
More Stories