Zero Shadow Day: నేడు ఆ సిటీలో అన్ని నీడలు మాయం.. ఈ విచిత్రం వెనకాల అసలు చరిత్ర ఇదే..

Unique Phenomenon Observe In Bengaluru On Today Called Zero Shadow Day Meaning History And Significance
x

Zero Shadow Day: నేడు ఆ సిటీలో అన్ని నీడలు మాయం.. ఈ విచిత్రం వెనకాల అసలు చరిత్ర ఇదే..

Highlights

Zero Shadow Day 2023: బెంగళూరు ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ఖగోళ శాస్త్రానికి సాక్ష్యమివ్వనుంది. నగరంలో కొద్దిసేపు వస్తువుల నీడ అస్సలు కనిపించదు. అందుకే షాడో డే అని పిలుస్తున్నారు.

Zero Shadow Day 2023: వెలుతురు ఉన్నప్పుడు మనకు నీడ కనిపించడం మాములే కదా. అయితే, ఓ ప్రాంతంలో మాత్రం నేడు అందరి నీడలు మాయం కానున్నాయి. అదెక్కడో కాదండోయ్.. మన దేశంలోనే. అదేంటో తెలుసుకుందాం పందడి మరి. ఏప్రిల్ 25న బెంగుళూరు ఒక విశిష్టమైన ఖగోళ శాస్త్రానికి సాక్ష్యమివ్వనుంది. నగరంలో కొంతసేపటి వరకు వస్తువుల నీడ మాయం కానుంది. అవునండీ.. ఇది వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తున్నా.. నేడు కొద్దిసేపు బెంగళూరులో ఇదే వింత జరగనుంది. అందుకే దీనిని షాడో డే అని పిలుస్తున్నారు. ఈ ఘటన మధ్యాహ్నం 12.17 గంటలకు జరగనుంది. బెంగళూరులోని కోరమంగళలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) ఈ సందర్భంగా తన క్యాంపస్‌లో ఈవెంట్‌లను నిర్వహించనుంది.

జీరో షాడో డే అంటే ఏమిటి?

ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ASI) ప్రకారం, సూర్యుని కారణంగా మధ్యాహ్నం భూమిపై ఏ వస్తువు నీడ కనిపించదు. ASI శాస్రవేత్తలు మాట్లాడుతూ, జీరో షాడో డే కర్కాటక రాశి, మకర రాశి మధ్య సంవత్సరానికి రెండుసార్లు కదులుతుంది. ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలకు, ఉత్తరాయణం, దక్షిణాయనం రెండింటిలోనూ సూర్యుని క్షీణత ఆ ప్రాంతాల అక్షాంశానికి సమానంగా ఉంటుంది. అందుకే సూర్యుడు నడి నెత్తిన కనిపిస్తాడంట. అప్పుడు నిటారుగా ఉన్న సమయంలో ఈ వింత చోటుచేసుకోనుంది.

ఇది ఎందుకు జరుగుతుంది?

భూభ్రమణ అక్షం సూర్యుని చుట్టూ తిరిగే సమతలానికి 23.5 డిగ్రీల వంపులో ఉంటుందని, దీని కారణంగా వివిధ రుతువులు ఏర్పడతాయాని ASI తెలిపింది. దీనర్థం సూర్యుడు, రోజులో అత్యంత ఎత్తైన ప్రదేశంలో, ఖగోళ భూమధ్యరేఖకు దక్షిణంగా 23.5 డిగ్రీల నుంచి భూమధ్యరేఖకు (ఉత్తరాయణ) ఉత్తరాన 23.5 డిగ్రీలకు, ఒక సంవత్సరంలో తిరిగి (దక్షిణాయన) కదులుతాడని వారు తెలిపారు.

ఈ భ్రమణ చలనం కారణంగా, ఉత్తరాయణం సమయంలో (సూర్యుడు ఉత్తరం వైపుకు వెళ్లినప్పుడు), మరొకటి దక్షిణాయణం సమయంలో (సూర్యుడు దక్షిణం వైపు వెళ్లినప్పుడు) ఈ జీరో షాడో డే వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 23.5°N, 23.5°S అక్షాంశాల మధ్య నివసించే వ్యక్తులకు, సూర్యుని క్షీణత వారి అక్షాంశానికి రెండు రెట్లు సమానంగా ఉంటుంది.

జీరో షాడో డే వ్యవధి ఎంత?

ఈ వింత సెకనులో కొంత భాగం మాత్రమే ఉంటుంది. కానీ, దాని ప్రభావం ఒకటిన్నర నిమిషాల వరకు కనిపిస్తుంది. ఒడిశాలోని భువనేశ్వర్ కూడా 2021లో జీరో షాడో డేని చవిచూసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories